Soil Testing : భూసార పరీక్షలతో అధిక దిగుబడులు

పంటను బట్టి 4 నుండి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో  ఎకరాకు 2 నుండి 4 చోట్ల  మట్టి నమూనా సేకరించాలి.

Soil Testing : భూసార పరీక్షలతో అధిక దిగుబడులు

soil testing

Soil Testing : ప్రస్తుత పరిస్థితుల్లో రైతులందరు భూసార పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. గత కొన్ని సంవత్సరాలుగా అధిక దిగుబడులు కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడటం వలన మన భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయే తప్పా.. దిగుబడులు పెరగడంలేదు. భూసార పరీక్షలు చేయడం ద్వారానే పంట పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకొని సరైన మోతాదుల్లో వేసుకోవచ్చు.

READ ALSO : Soil Testing : భూసార పరీక్షలతో తగ్గనున్న.. పంట పెట్టుబడులు

నేలల్లో ఉన్న పోషక పదార్థాలతో పాటు, అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడుతాయి. కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవటం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలో అనవసరపు ఖర్చులు చేయకుండా, భూసారాన్ని కాపాడుకుంటూ, అధిక దిగుబడులను దిగుబడులను పొందవచ్చు.

దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని 2 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది. పోషక పదార్ధాల గురించేకాక, భూమిలోని చౌడు గుణాలను, సున్నం శాతాన్ని, నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడుతాయి.

READ ALSO : Soil Testing : భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు

మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నింటి కన్నా ముఖ్యమైనది . భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరియైనది కానిచో, దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీని వలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణఁగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక, ఒక్కొకసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి, మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలంటున్నారు  రాజేంద్రనగర్ లోని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డా. మాధవి.

పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించేటప్పుడు సాధారణంగా పంటను బట్టి 4 నుండి 5 అడుగుల లోతు గుంటను తవ్వాలి. ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి. పండ్ల తోటల విషయంలో  ఎకరాకు 2 నుండి 4 చోట్ల  మట్టి నమూనా సేకరించాలి.

READ ALSO : Green Manure Cultivation Tips : భూసారం పెరిగేందుకు దోహదపడుతున్న పచ్చిరొట్టపైర్లు

సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిబెట్టి మంచి ప్లాస్టిక్ బ్యాగులో గాని, గుడ్డసంచిలో గాని నింపి, సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధిచిన భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. దీంతో పాటు  రైతు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం .. ఇంతకు మునుపు పంట, దానికి వాడిన ఎరువులు,  వేయబోవు పంట వివరాలను రైతులు కాగితంలో  వ్రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి, భూసార పరీక్ష కేంద్రానికి పంపాలి.

మట్టి నమూనా సేకరణకు రసాయనిక , సేంద్రీయ ఎరువుల సంచులను వాడకూడదు . గట్ల దగ్గర, పంట కాలువలలోను మట్టిని తీయరాదు. అంతే కాదు చెట్ల క్రింది భాగంలో నుంచి మట్టిని సేకరించకూడదు. ఎరువు  కుప్పలు వేసి ఉంచిన చోట ,ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు.

READ ALSO : Intercropping : మిశ్రమ పంటల సాగుతో భూసార పరిరక్షణతోపాటు, చీడపీడల నుండి పంటల రక్షణ సాధ్యమేనా?

పోలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు, దానిని ఎత్తు, పల్లపు ప్రాతాలుగా విభజించి వేరు మట్టి నమూనాలను సేకరించాలి.  పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుంచి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి. అంతేగాని, అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలుపరాదు.