Soil Testing : భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు

నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మట్టిలో ఉండే భూసారాన్ని తెలుకోవాలి. ఇందుకోసం, భూసార పరీక్షలు చేయించాలి. తద్వారా మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుస్తుంది. ఎరువులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది.

Soil Testing : భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు

Soil Testing

Soil Testing : సమయానికి తినకుండా ఉంటే మన శరీరం నిరసించిపోయి ఏ పని చేయలేం. అలాగే పొలంలో పంట బాగా పండాలంటే మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. అది తెలుసుకోవాలంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు ఏ పంట వేస్తే అధిక దిగుబడులు పొందవచ్చు అనేది రైతులకు తెలుస్తుందని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌డా. చిన్నామనాయుడు.

READ ALSO : Low Crop Yields : పంట దిగుబడులు తక్కువగా ఉన్న భూముల్లో రైతులు చేపట్టాల్సిన యాజమాన్యం!

అధిక దిగుబడుల కోసం పంట పొలాల్లో రసాయనిక ఎరువులు, పురుగు మందుల విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో మనకు తెలియకుండానే భూసారం అనేది క్రమంగా తగ్గిపోతున్నది. దీని వలన భూమికి ఉన్న సహజ గుణాలు, నేల ఆరోగ్య పరిస్ధితి నానాటికి క్షీణిస్తోంది. అంతేకాకుండా రైతుకు, పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి.

నాణ్యమైన దిగుబడులు పొందాలంటే మట్టిలో ఉండే భూసారాన్ని తెలుకోవాలి. ఇందుకోసం, భూసార పరీక్షలు చేయించాలి. తద్వారా మట్టిలో ఎంత సారం ఉందనేది తెలుస్తుంది. ఎరువులు, రసాయనాలు ఎంత మోతాదులో వాడాలో రైతులకు తెలుస్తుంది. దీంతో ఎరువుల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది.

READ ALSO : Soil Testing : భూసార పరీక్షలతో.. తగ్గనున్న పెట్టుబడి

పొలంలో ఏ పంటలూ లేని వేసవికాలంలో, భూసార పరీక్షలు చేయించటానికి అనువైన సమయం. నేల స్థితిగతులను తెలుసుకుని,  అవసరం మేర ఎరువులను వాడుకోవటం వల్ల ఎరువులపై పెట్టె ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు.పరీక్షల ఆధారంగా సూక్ష్మపోషకాలందిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. అంతే కాకుండా ఖరీఫ్ కు సిద్ధమయ్యేందుకు రైతాంగం ఇప్పుడే అన్ని సిద్ధం చేసుకుంటే తొలకరి నాటికి సునాయాసంగా విత్తనాలను విత్తుకోవచ్చు.