Hijab Row: రాజస్థాన్‌లోనూ హిజాబ్ రచ్చ మొదలైంది : కాంగ్రెస్ ఎమ్మెల్యే

హిజాబ్ ఆందోళనలను రాజస్థాన్ లోనూ మొదలుకానున్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. జైపూర్‌లోని చక్సులో ప్రైవేట్ కాలేజిలో శుక్రవారం బుర్ఖా వేసుకుని కాలేజికి వస్తున్న యువతులను....

Hijab Row: రాజస్థాన్‌లోనూ హిజాబ్ రచ్చ మొదలైంది : కాంగ్రెస్ ఎమ్మెల్యే

Hizab Row

Hijab Row: హిజాబ్ ఆందోళనలను రాజస్థాన్ లోనూ మొదలుకానున్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. జైపూర్‌లోని చక్సులో ప్రైవేట్ కాలేజిలో శుక్రవారం బుర్ఖా వేసుకుని కాలేజికి వస్తున్న యువతులను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. హిజాబ్ ధరించిన యువతులను కాలేజీల్లోకి ఎంటర్ కానివ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వజీబ్ అలీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సీఎం అశోక్ గెహ్లాట్ దీనిపై యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ‘రాజస్థాన్ ను ద్వేషపూరిత వ్యక్తుల నుంచి కాపాడాలని సీఎం అశోక్ గెహ్లాట్ ను డిమాండ్ చేస్తున్నారు. ఘటన పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా’ అంటూ ఫొటోలతో ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వజీబ్ అలీ.

కస్తూరి దేవీ కాలేజికి చెందిన కొందరు మహిళా స్టూడెంట్లు కాలేజీ యాజమాన్యంపై కోపం వ్యక్తం చేశారు. వారి యూనిఫామ్స్ పట్ల అడ్మినిస్ట్రేషన్ ప్రవర్తించిన తీరును కుటుంబ సభ్యులకు తెలియజేసి కాలేజీకి పిలిపించారు. చిన్నపాటి ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు.

Read Also : కేసీఆర్ యాదాద్రి పర్యటన, రాయగిరిలో బహిరంగ సభ

‘కాలేజీలో యూనిఫాం మాత్రమే ధరించాలని విద్యార్థులను కన్విన్స్ చేశారు. మాటలతో ఈ విషయం ఇక్కడితో సద్దుమణిగిపోయింది’ అని చక్సు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జితేంద్ర సింగ్ తెలిపారు.