Hindus Only: జాబ్స్ అప్లై చేసుకోండి.. కేవలం హిందువులకు మాత్రమే

జాబ్స్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కాంట్రవర్సీగా మారింది. హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ పలు పోస్టులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసింది.

Hindus Only: జాబ్స్ అప్లై చేసుకోండి.. కేవలం హిందువులకు మాత్రమే

Hindus Only

Hindus Only: జాబ్స్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ కాంట్రవర్సీగా మారింది. హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ పలు పోస్టులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేసింది. అక్టోబర్ 13న రిలీజ్ చేసిన ప్రకటనలో అరుల్మిగూ కపలీశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల కోసం కేవలం హిందువులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పింది.

హెచ్ఆర్ & సీఈ డిపార్ట్‌మెంట్ నాలుగు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలు ఓపెన్ చేయాలనుకుంటుంది. దాని కోసం బీకామ్, బీబీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, తమిళ్, ఇంగ్లీష్, మ్యాథమ్యాటిక్స్ కోర్సులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ పంపింది. నాన్ టీచింగ్ స్టాఫ్, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, వాచ్‌మ్యాన్, స్వీపర్ పోస్టులు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పోస్టులకు కేవలం హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ మాజీ ప్రెసిడెంట్ కే.పాండ్యన్ మాట్లాడుతూ.. ‘హెచ్ఆర్ & సీఈ డిపార్ట్‌మెంట్ కు చెందిన 36స్కూల్స్, ఐదు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలు, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా ఇలా హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తొలిసారి ప్రకటన వెలువడింది.

………………………………………..: కంప్యూటర్, మొబైల్ స్క్రీన్స్ చూస్తున్నారా.. కొత్త వ్యాధి రావొచ్చు జాగ్రత్త!!

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సంస్థ ఎప్పుడూ ఇతర మతస్థులను కించపరచడం, వివక్ష చూపించడం లాంటివి చేయలేదని అన్నారు.