HIT 2: కన్ఫం.. హిట్ 2 వచ్చేది ఆ రోజునే!

యంగ్ హీరో అడివి శేష్ నటించిన రీసెంట్ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ వర్స్‌లో సెకండ్ కేస్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యస్ చేయగా, ప్రేక్షకులను ఈ మూవీ థ్రిల్ చేసింది. ఈ సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

HIT 2: కన్ఫం.. హిట్ 2 వచ్చేది ఆ రోజునే!

HIT 2 OTT Premiere On Jan 2 On Amazon Prime

HIT 2: యంగ్ హీరో అడివి శేష్ నటించిన రీసెంట్ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తన హిట్ వర్స్‌లో సెకండ్ కేస్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యస్ చేయగా, ప్రేక్షకులను ఈ మూవీ థ్రిల్ చేసింది. ఈ సినిమాలో ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

HIT 2: హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఓటీటీలో జెట్ స్పీడుగా దూసుకొస్తున్న అడివి శేష్ మూవీ!

అయితే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవడంతో, ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మూవీ జనవరి మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతుందని చిత్ర వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డేట్‌ను కన్ఫం చేసింది అమెజాన్ ప్రైమ్.

HIT 2: ఆరు రోజుల్లోనే అన్ని చోట్లా లాభాలను తెచ్చిపెట్టిన హిట్-2

హిట్-2 చిత్రాన్ని జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాలో నాని ఓ కేమియో పాత్రలో కనిపించాడు. ఇక నెక్ట్స్ సీక్వెల్ మూవీలో నాని హీరోగా కనిపించబోతున్నట్లు ఈ సినిమాలోనే రివీల్ చేయడంతో అభిమానులు హిట్-3 కోసం ఆతృతగా చూస్తున్నారు. మరి ఈ సినిమాను ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.