James Gunn : ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఉంది.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ, సూసైడ్ స్క్వాడ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ జేమ్స్ గన్ తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో RRR సినిమా ప్రస్తావన వచ్చింది.

James Gunn : ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఉంది.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

Hollywood Director James Gunn wants to work with NTR

James Gunn :  మన RRR సినిమా ప్రపంచమంతటా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఆస్కార్(Oscar) వరకు వెళ్లి నాటు నాటు(Naatu Naatu) పాటతో ఆస్కార్ సాధించి ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇక ఎన్టీఆర్(NTR), రాజమౌళి(Rajamouli), రామ్ చరణ్(Ram Charan) లకు ప్రపంచమంతటా పేరు వచ్చింది. దేశ విదేశాల్లో వీళ్లకు అభిమానులు ఏర్పడ్డారు. ఆస్కార్ ప్రమోషన్స్ సమయంలో చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ రాజమౌళిని, చరణ్, ఎన్టీఆర్ లను అభినందించారు.

అనేక హాలీవుడ్ మీడియాలు ఈ ముగ్గురిని గొప్పగా చూపిస్తూ వార్తలు కూడా రాశారు. పలు హాలీవుడ్ మీడియాలు వీరి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఇప్పటికే అనేకమంది హాలీవుడ్ ప్రముఖులు వీరితో కలిసి పనిచేయాలని ఉందని చెప్పారు. తాజాగా మరో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ కలిసి వర్క్ చేయాలని ఉందని అన్నారు.

గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ, సూసైడ్ స్క్వాడ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ జేమ్స్ గన్ తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో RRR సినిమా ప్రస్తావన వచ్చింది. దీంతో జేమ్స్ గన్ మాట్లాడుతూ.. RRR సినిమాలో టైగర్స్ మధ్యలో బోనులోంచి వచ్చే వ్యక్తి, ఆ అబ్బాయి చాలా అద్భుతంగా చేశాడు. అతనితో కలిసి భవిష్యత్తులో వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని తెలిపారు. అతని పేరు అని అడగడంతో అక్కడి మీడియా వాళ్ళు ఎన్టీఆర్ అని చెప్పగా.. హా, అతనితో కలిసి పని చేయాలనుకుంటున్నాను అని అన్నారు. మరి అతని కోసం ఏమైనా పాత్ర రాసుకున్నారా లేదా ఆలోచించారా అని అడగగా.. ప్రస్తుతానికి ఏమి అనుకోలేదు, దాని గురించి ఆలోచిస్తాను, అందుకు ఇంకొంచెం టైం పడుతుంది అని అన్నారు.

Kajal Aggarwal : కాజల్ తనయుడి ఫస్ట్ బర్త్ డే.. అందరూ ఒకే టీ షర్ట్స్‌లో.. కాజల్ ఫ్యామిలీ స్పెషల్ పిక్ చూశారా..

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తూ త్వరలోనే ఇది జరిగితే బాగుండు అని కోరుకుంటున్నారు.