Hombale Films : KGF నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ మాములుగా లేవుగా..

KGF లాంటి సాలిడ్ హిట్ తర్వాత పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతోంది హోంబల్ ఫిల్మ్స్. కేవలం కన్నడకే పరిమితం కాకుండా KGF నిర్మాతలు మిగిలిన సౌత్ ఇండస్ట్రీల స్టార్స్ తో

Hombale Films : KGF నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ మాములుగా లేవుగా..

Hombale Films :   KGF లాంటి సాలిడ్ హిట్ తర్వాత పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతోంది హోంబల్ ఫిల్మ్స్. కేవలం కన్నడకే పరిమితం కాకుండా KGF నిర్మాతలు మిగిలిన సౌత్ ఇండస్ట్రీల స్టార్స్ తో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. KGF సినిమాతో నేషనల్ వైడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా గుర్తింపు అందుకుంది హోంబల్ ఫిలిమ్స్. ఇక రానున్న రోజుల్లో అంతకుమించి అనేలా సినిమాలను తీసుకొచ్చేందుకు నిర్మాతలు ట్రై చేస్తున్నారు. కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సంస్థ సినిమాలను నిర్మించేందుకు సిద్ధమైంది.

 

కేరళ ఇండస్ట్రీలో యాక్టర్ గా, డైరెక్టర్ గా తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపును అందుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తో ఓ కొత్త ప్రాజెక్టు ను స్టార్ట్ చేయబోతున్నట్లు హోంబల్ ఫిలిమ్స్ ప్రకటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ తో చేయబోయే సినిమా కూడా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ తో చెప్పేసారు. టైసన్ అనే టైటిల్ తో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ నటించబోతున్నాడు పృథ్వీరాజ్.

మలయాళీ హిట్స్ లూసిఫర్, బ్రోడాడి లాంటి సినిమాలను డైరెక్ట్ చేసి పృథ్వీరాజ్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాడు. నిర్మాతగానూ క్లాలిటీ ఉన్న సినిమాలను ప్రెజెంట్ చేస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియుమ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. థియేటర్స్ లో సూపర్ హిట్టైన జనగణమనను ఈమధ్య ఓటీటీకి తీసుకొచ్చి నేషనల్ వైడ్ ప్రశంసలు అందుకుంటున్నాడు.

ప్రభాస్ సలార్ లో విలన్ గా నటిస్తోంది పృథ్వీరాజ్ సుకుమారనే. ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబోలో హోంబల్ ఫిల్మ్స్ సలార్ ను నిర్మిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 1 తర్వాత వెంటనే గ్లోబల్ స్టార్ ప్రభాస్ ను, ప్రశాంత్ నీల్ ను కలిపేసింది హోంబల్ ఫిల్మ్స్. కన్నడ తర్వాత టాలీవుడ్ పైనే ఫోకస్ చేసిన హోంబల్ నిర్మాత విజయ్ కిరంగదూర్ సలార్ ను సర్ ప్రైజింగ్ గా స్టార్ట్ చేసి నెక్ట్స్ సమ్మర్ లో తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు.

Indian Cinema : ఇండియన్ సినిమాటిక్ యూనివర్స్..

ఈమధ్యే భగీరాను స్టార్ట్ చేసింది హోంబల్ ఫిల్మ్స్. ఈ సినిమాకు కథను అందించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. KGF లాంటి డార్క్ బ్యాక్ డ్రాప్ తోనే శ్రీమురళీ హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో శ్రీమురళీ, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఉగ్రం మూవీ రిలీజై కన్నడలో బ్లాక్ బస్టర్ కొట్టింది.

Pawan Klayan : మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలకి బ్రేక్ ఇస్తారా??

 

ప్రభాస్ తో టాలీవుడ్, పృథ్వీరాజ్ తో మలయాళీ ఎంట్రీ ఇస్తోన్న హోంబల్ ఫిల్మ్స్ ప్రస్తుతం నాలుగు కన్నడ సినిమాలను లైన్ లో పెట్టింది. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ పెయిర్ గా కాంటారా, జగ్గేశ్ రాఘవేంద్ర స్టోరీస్ తో పాటూ రిచర్డ్ ఆంటోనీ సినిమాల నిర్మాణంలో బిజీగా ఉంది. ఇకపై మాత్రం పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. KGFతో వచ్చిన స్టార్ డంను, స్టేటస్ ను నిలబెట్టుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకే బడా హీరోలతో అన్ని భాషల్లోనూ సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు హోంబల్ ఫిలిమ్స్.