Air India: వారం రోజుల పాటు ఎయిరిండియా విమానాలను నిషేదించిన హాంకాంగ్

వారం రోజుల పాటు ఎయిరిండియా విమానాలను రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 24వరకూ విమాన సర్వీసులను వాయిదా వేశారు. శనివారం కొవిడ్-19 కారణంగా ముగ్గురు..

Air India: వారం రోజుల పాటు ఎయిరిండియా విమానాలను నిషేదించిన హాంకాంగ్

Air India

Air India: వారం రోజుల పాటు ఎయిరిండియా విమానాలను రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్ 24వరకూ విమాన సర్వీసులను వాయిదా వేశారు. శనివారం కొవిడ్-19 కారణంగా ముగ్గురు మృత్యువాతకు గురి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్ వెల్లడించారు.

ప్రయాణానికి 48 గంటల ముందు చేయించుకున్న పరీక్షా ఫలితాల్లోని కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తో మాత్రమే అనుమతిస్తామని హాంకాంగ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతో పాటు హాంకాంగ్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత మరోసారి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఏప్రిల్ 16న Air India’s AI316 Delhi-Kolkata-Hong Kong విమానంలో ప్రయాణించి వచ్చిన ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో న్యూఢిల్లీ, కోల్‌కతా నుంచి వచ్చే ఎయిరిండియా విమానాలను ఏప్రిల్ 24వరకూ రద్దు చేస్తున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం కన్ఫామ్ చేసిందని అధికారులు చెబుతున్నారు.

Read Also: ఎయిరిండియా కొత్త ఛైర్మన్‌గా చంద్రశేఖరన్

ఈ స్టేట్మెంట్ ఎయిరిండియా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కరోనా ప్రభావంతో రెండేళ్ల విరామం తర్వాతే రెగ్యూలర్ ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలను పునరుద్ధరించారు.

రెండు నెలలుగా చైనా తూర్పు ప్రాంతంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. నిత్యం సరాసరి 15 వేల కొత్త కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే దేశ ఆర్ధిక రాజధాని షాంఘై సహా తూర్పు ప్రాంతంలోని 27 నగరాలలో కఠిన లాక్ డౌన్, 17 నగరాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించారు అక్కడి అధికారులు. సోమవారం షాంఘై నగర ఆరోగ్య కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం గడిచిన 24 గంటల్లో ఒక్క షాంఘై నగరంలోనే 3,238 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ కాగా, మరో 21,582 మందిలో లక్షణరహిత వైరస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.