GPay UPI Payments : గూగుల్ పేలో క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్ ఈజీగా చేసుకోవచ్చు!

GPay UPI Payments : ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ UPI పేమెంట్స్ చేసేందుకు (Google Pay) యూజర్లు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌లను కూడా లింక్ చేయవచ్చు.

GPay UPI Payments : గూగుల్ పేలో క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ పేమెంట్స్ ఈజీగా చేసుకోవచ్చు!

How to make UPI payments through GPay using your credit card

Updated On : June 10, 2023 / 10:08 PM IST

GPay UPI Payments : భారత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్‌లైన్ పేమెంట్లలో ప్రధానంగా యూపీఐ పేమెంట్ల ద్వారా అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. వస్తువుల కొనుగోలు నుంచి ఇతర సర్వీసులకు పేమెంట్లను చేసేందుకు చాలా సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. అనేక పాపులర్ పేమెంట్ గేట్‌వేలు అందుబాటులో ఉన్నాయి. అందులో (Google Pay) డిజిటల్ పేమెంట్ సర్వీసు ఒకటి. గూగుల్ పే యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్, ఇప్పుడు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్‌ల నుంచి కూడా UPI పేమెంట్లను చేసేందుకు అనుమతిస్తుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభంలో వినియోగదారులు తమ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించి UPI పేమెంట్లు చేయడానికి అనుమతించింది. అయితే, ఇటీవల (Google Pay)తో కలిసి పనిచేసింది. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్‌ల ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించింది. ఈ ఇంటిగ్రేషన్ వినియోగదారులు తమ కార్డ్‌ని ఎక్కడికీ తీసుకెళ్లకుండా కేవలం మర్చంట్ QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా తమ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి పేమెంట్లు చేయడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూన్ 2022లో UPI ప్లాట్‌ఫారమ్‌కు RuPay క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేసేందుకు అనుమతించింది.

Read Also : Apple iPhone 11 Sale : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 11.. కేవలం రూ. 8,950కే సొంతం చేసుకోవచ్చు.. డోంట్ మిస్!

యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, HDFC బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ బ్యాంకుల నుంచి రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లందరికీ ఈ ఫీచర్ ఇప్పుడు అందుబాటులో ఉందని (RuPay) ప్రకటించింది. అదనంగా, ఈ కొత్త విధానాన్ని త్వరలో మరిన్ని బ్యాంకులు అనుసరిస్తాయని రూపే యూజర్లకు హామీ ఇచ్చింది. మీరు ఎంపిక చేసుకున్న బ్యాంక్‌లలో ఒకదాని నుంచి రూపే క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉంటే.. పేమెంట్లు చేయడానికి Google Payకి లింక్ చేయవచ్చు. మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి GPay ద్వారా UPI పేమెంట్లు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

How to make UPI payments through GPay using your credit card

How to make UPI payments through GPay using your credit card

గూగుల్ పేలో క్రెడిట్ కార్డ్‌ని ఎలా ఉపయోగించాలంటే? :
* మీ Gpay అకౌంట్లో RuPay క్రెడిట్ కార్డ్‌ని యాడ్ చేయండి.
* మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Pay యాప్‌ని ఓపెన్ చేయండి.
* యాప్‌లోని సెట్టింగ్‌ల మెనుకి వెళ్లండి.
* ‘సెటప్ పేమెంట్ మెథడ్’పై Tap చేయండి. ‘Add Rupay Credit Card’ ఎంచుకోండి.
* మీ రూపే క్రెడిట్ కార్డ్ చివరి 6 అంకెలు, గడువు తేదీ, పిన్‌ను ఎంటర్ చేయండి.
* UPIలో రూపే క్రెడిట్ కార్డ్‌ని యాక్టివేట్ చేయండి
* కార్డ్‌ని యాక్టివేట్ చేసేందుకు Google Pay యాప్‌లోని మీ ప్రొఫైల్‌లో ‘UPIలో RuPay క్రెడిట్ కార్డ్’పై Tap చేయండి.
* మీ రూపే క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి.
* మీ రూపే క్రెడిట్ కార్డ్ కోసం ప్రత్యేకమైన UPI PINని సెట్ చేయండి.
* మీ రూపే క్రెడిట్ కార్డ్ ఇప్పుడు UPI పేమెంట్లకు రెడీగా ఉంది.
* మర్చంట్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌లో, UPIని పేమెంట్ ఆప్షన్‌గా ఎంచుకోండి.
* UPI IDని ఎంటర్ చేయండి లేదా మర్చంట్ QR కోడ్‌ని స్కాన్ చేయండి.
* పేమెంట్ మొత్తాన్ని నిర్ధారించి, మీ UPI పిన్‌ని ఎంటర్ చేసి, పేమెంట్ పూర్తి చేయండి.

Read Also : Best-selling SUV Cars : మేలో అత్యధికంగా అమ్ముడైన 10 SUV కార్లు ఇవే.. అందులో 3 మారుతి మోడల్స్ టాప్..!