Fire Accident: కొండాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బూడిదైన సైక్లింగ్ పార్క్ గోదాం
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని ఉత్తమమైన పర్యాటక..

Fire Accident
Fire Accident: హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని ఉత్తమమైన పర్యాటక ప్రాంతాలలో ఒకటైన ఈ పాలపిట్ట సైక్లింగ్ పార్క్, బొటానికల్ గార్డెన్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు.
Rains In Hyderabad: హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం: ఉపశమనం పొందిన నగర వాసులు
ఈ ప్రమాదంలో సైక్లింగ్ పార్క్ లోని గోదాం పూర్తిగా కాలి బూడిదైంది. ఆదివారం వేకువ జామున ఈ ప్రమాదం వెలుగులోకి రాగా అప్పుడే స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. బొటానికల్ గార్డెన్ లోని గోదాంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాధమిక అంచనాకు రాగా.. మూసివున్న గోదాంలో మంటలు ఎగసి పడుతుండగా స్థానికులు గమనించారు.
Hyderabad : జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసు.. 20 గంటలు దాటినా ముందుకు సాగని దర్యాప్తు
కాగా ఈ అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది.. ఎంత నష్టం వాటిల్లింది అనేది తెలియాల్సి ఉండగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.