Huzurabad By-Election : ఫలితంపై ఉత్కంఠ, కౌంటింగ్‌కు అంతా సిద్ధం!

ఉప ఎన్నిక ఫలితం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు.

Huzurabad By-Election : ఫలితంపై ఉత్కంఠ, కౌంటింగ్‌కు అంతా సిద్ధం!

Hzb Election

Huzurabad By-Election Result : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేది ఎవరు ? అనే ఉత్కంఠ నెలకొంది. హోరాహోరీగా సాగిన ప్రచారంలో నేతలు ఉధృతంగా ప్రచారం చేశారు. ప్రధాన పార్టీలైన…టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తాము కూడా ప్రభావం చూపిస్తామని కాంగ్రెస్ అంటోంది. అయితే…ఓటర్లు ఎవరికి తీర్పునిచ్చారో 2021, నవంబర్ 02వ తేదీ మంగళవారం తెలియనుంది.

Read More : LPG Price Hike : భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. సిలిండర్‌పై రూ.266 పెంపు

ఉప ఎన్నిక ఫలితం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో కౌంటింగ్ జరుగనుంది. కౌంటింగ్ సెంటర్ వద్ద మూడెంచల భధ్రత ఏర్పాటు చేశారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 22 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదటి అరగంట  పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం  753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్ లో కౌంటింగ్ జరగనుంది. ఒక్క హాళ్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్ కు14 టేబుల్స్ పై 14 ఈవీఎలను లెక్కిస్తారు.

Read More : Hyderabad : యువ హీరో ఫామ్‌హౌజ్‌లో పేకాట గుట్టురట్టు..రూ.6 లక్షల 77 వేలు, 20 కార్లు స్వాధీనం

2021, అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. మొత్తం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా భారీగా ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైందని అంచనా వేస్తున్నారు. భారీగా పోలింగ్ నమోదు కావడంతో తమదంటే తమదే గెలుపని పార్టీల అభ్యర్థులు వెల్లడిస్తున్నారు. కానీ..అసలు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించారనేది మంగళవారం తేలనుంది. నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు గట్టి పట్టు ఉండడంతో గెలుపు తననే వరిస్తుందని ఆయన నమ్మకం పెట్టుకున్నారు.

Read More : Maha Padayatra : నేటి నుంచి రాజధాని రైతుల మహా పాదయాత్ర

టీఆర్ఎస్ లో మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు రావడంతో..ఆయనపై టీఆర్ఎస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడం..మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఈటల..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరు వెంకట్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. మరి గెలుపు ఎవరిని వరిస్తుందనేది మంగళవారం తేలనుంది.