Huzurabad : అక్టోబర్ – నవంబర్ లోనే హుజూరాబాద్ బైపోల్!

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో... కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Huzurabad : అక్టోబర్ – నవంబర్ లోనే హుజూరాబాద్ బైపోల్!

Huzurabad By Poll

Huzurabad : ఏపీ, తెలంగాణలో బైపోల్ హీట్ కొనసాగుతోంది. ఐతే.. ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే ఊహాగానాలకు మాత్రం బ్రేకులు పడటం లేదు. ఓవైపు పార్టీలు… ఎన్నికల సమరంలో దూకి ప్రచారాన్ని హీటెక్కిస్తున్నా… ఎన్నికల నిర్వహణ మాత్రం మరింత లేటయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల నిర్వహణకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో… కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, కడప జిల్లా బద్వేల్ లలో బైపోల్ జరగాల్సి ఉంది.

Read This : By-Polls : ఉపఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. హుజురాబాద్ బైపోల్ లేటయ్యేనా..?

వరదలు, పండుగలు, కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉప-ఎన్నికలు ఇప్పుడే వద్దని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 11 రాష్ట్రాలు కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరాయి. పండుగల సీజన్ తర్వాతే ఉప-ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తిచేశాయి. దీంతో… సీఈసీ కూడా తెలంగాణ, ఏపీ సహా.. పలు రాష్ట్రాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని… షెడ్యూల్స్ ప్రకటిస్తున్నట్టు కనిపిస్తోంది. లేటెస్ట్ గా… వెస్ట్ బెంగాల్, ఒడిశాల్లోని 4 సెగ్మెంట్లకు మాత్రమే ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది ఈసీ. అక్టోబర్ లో దసరా, దీపావళి తరువాతే హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

దేశమంతటా 32 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో… ఉప-ఎన్నికల నిర్వహణపై రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఆ మధ్య కోరింది ఎన్నికల సంఘం. ఉప ఎన్నికల నిర్వహణ పై తమ అభిప్రాయాలను ఈసీకి రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయి.

Read This : CM KCR : నాలుగో రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్

తమ రాష్ట్రంలో కరోనా పూర్తి నియంత్రణలో ఉందని, వరదలు అడ్డంకి కావని ఈసీకి ఒడిశా, బెంగాల్ చీఫ్ సెక్రటరీలు తెలియజేశారు. ఉప ఎన్నికలకు నిర్వహణకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని తెలిపాయి. మరోవైపు.. బైపోల్ కు రెడీగా లేమని.. ఈసీకి ఏపీ, తెలంగాణ, అసోం, బీహార్,హర్యానా,హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయ,రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలి,డామన్ డయ్యు తెలిపాయి. హుజూరాబాద్ బైపోల్ లేట్ అయిన కొద్దీ.. తెలంగాణలో పొలిటికల్ పెరిగే చాన్సెస్ ఉన్నాయి. హుజూరాబాద్ లో గెలుపే లక్ష్యంగా  పథకాలతో గులాబీ సర్కారు వ్యూహాలు అమలుచేస్తోంది.  గెలుపు తప్ప మరో చాయిసే లేదంటూ.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాదయాత్రలు, సభలు, సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఈ బైపోల్ హీట్.. మరో 2,3 నెలలు కొనసాగే చాన్సెస్ ఉన్నాయి.