Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

హుజూరాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖ సహా.. పలు పేర్లు వినిపించినప్పటికీ... అనేక చర్చోపచర్చల తర్వాత.... బల్మూరి వెంకట్ కు టికెట్ ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. 

Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

Huzurabad Congress Candidate Balmuri Venkat

Huzurabad : తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ బైపోల్ బరిలో తమ అభ్యర్థిని దింపింది కాంగ్రెస్ పార్టీ. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి…. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ నుంచి ఈ స్థానంలో పోటీ పడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థిపై నాన్చుతూ వచ్చి ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్ పార్టీ… ఎట్టకేలకు తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. హుజూరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే తమ క్యాండిడేట్ ను టీపీసీసీ ప్రకటించింది.

Huzurabad By Election : ఈటలకు చావోరేవో..బీజేపీ గెలుస్తుందా ?

NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న బల్మూరి వెంకట్ ను హుజూరాబాద్ ఉపఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. పీసీసీ, సీఎల్పీ నేతలు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన  పలుమార్లు జరిగిన భేటీలో.. సీనియర్ల అభిప్రాయాలతో… బల్మూరి వెంకట్ పేరును ఖరారు చేసినట్టు తెలిసింది.

బల్మూరి వెంకట్…  కాంగ్రెస్ యువ నాయకుడిగా ఇప్పటికే పలు నిరసనలు, ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తుతూ.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్న ఆయనను ఉపఎన్నికల బరిలో దింపాలని.. జగ్గారెడ్డి సహా.. పలువురు సీనియర్లు కోరారు. హుజూరాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖ సహా.. పలు పేర్లు వినిపించినప్పటికీ… అనేక చర్చోపచర్చల తర్వాత…. బల్మూరి వెంకట్ కు టికెట్ ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది.

Huzurabad : నామినేషన్ వేయనున్న గెల్లు శ్రీనివాస్, ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం కేసీఆర్

పీసీసీ నిర్ణయంతో.. హుజూరాబాద్ కు బయల్దేరి వెళ్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు, NSUI నేతలు. టీఆర్ఎస్, బీజేపీలతో సమానంగా.. ఇకనుంచి ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. దూకుడు పెంచాలని డిసైడయ్యారు.