No Syringes : సిరంజీలు తెచ్చుకుంటేనే వ్యాక్సిన్ వేస్తాం..

GHMC అధికారుల నిర్లక్ష్యం వ్యాక్సినేషన్ పై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ల కొరత వేధిస్తే...ఇప్పుడు వ్యాక్సిన్లు ఉన్నాయి..టీకా వేయించుకోవటానికి జనాలు కూడా ఉన్నారు. కానీ వారికి టీకా వేయటానికి మాత్రం సిరంజీలు లేవు అంటున్నారు వైద్య సిబ్బంది. సిరంజీలు బయటనుంచి తెచ్చుకుంటనే వ్యాక్సిన్ వేస్తామంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునేవారు సిరంజీలు కూడా తెచ్చుకోవాలని లేకుంటే వ్యాక్సిన్ వేసే పరిస్ధితి లేదు అని చెబుతున్నారు.

No Syringes : సిరంజీలు తెచ్చుకుంటేనే వ్యాక్సిన్ వేస్తాం..

Shortage Of Syringes In Ghmc Area

shortage of syringes In GHMC Area : GHMC అధికారుల నిర్లక్ష్యం వ్యాక్సినేషన్ పై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ల కొరత వేధిస్తే…ఇప్పుడు వ్యాక్సిన్లు ఉన్నాయి..టీకా వేయించుకోవటానికి సిద్ధంగా జనాలు ఉన్నారు. కానీ వారికి టీకా వేయటానికి మాత్రం సిరంజీలు లేవు. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ల కొరతగా ఉండేవి. కానీ ఇప్పుడు వేయటానికి వ్యాక్సిన్లు ఉన్నాయి గానీ చేయటానికి సిరంజీలు మాత్రం లేవు అంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునేవారు సిరంజీలు కూడా తెచ్చుకోవాలని లేకుంటే వ్యాక్సిన్ వేసే పరిస్ధితి లేదు అని చెబుతున్నారు.

హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతంలోని చంపాపేటలో వ్యాక్సిన్లు వేయించుకోవటానికి వచ్చిన జనాలకు సిబ్బంది సిరంజీలు లేవు..మీకు మీరే సిరంజీలు తెచ్చుకుంటేనే వ్యాక్సిన్ వేస్తామని చెబుతున్నారు వైద్య సిబ్బంది. చంపాపేట వ్యాక్సినేషన్ కేంద్రానికి 1500లమంది వచ్చారు. కానీ వారికి టీకా వేయటానికి మాత్రం సిరంజీలులేవు అని చెబుతున్నారు సిబ్బంది. వ్యాక్సిన్ కావాలంటే సిరంజీలు బయట నుంచి మీరే తెచ్చుకోండి అని చెబుతున్నారు. దీంతో మెడికల్ షాపులకు వెళ్లి సిరంజీలు తెచ్చుకుంటున్నారు. అలా తెచ్చుకున్నవారికి మాత్రమే వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేశారు.ఈక్రమంలో వరుసగా అందరూ మెడికల్ షాపులకు సింరజీల కోసం వెళ్లగా ఆ ప్రాంతంలో సిరంజీల రేటు కూడా పెంచేసినట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిపై జనాలు మండిపడుతున్నారు.

కాగా..హైదరాబాద్ లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా అందటానికి ప్రభుత్వం జీహెచ్ ఎంసీకే అప్పగించింది. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో పొదుపు సంఘల మహిళలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా నగరంలోని పలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 1500 మందికి వ్యాక్సిన్ వేయటానికి వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈక్రమంలో చంపాపేటలోని కేంద్రానికి 1500లమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి పొదుపు సంఘాల మహిళలు వారి కుటుంబ సభ్యులు రాగా..వారికి వేయటానికి వ్యాక్సిన్లు ఉన్నాయి గానీ సిరంజీలు మాత్రం లేవనీ మీరే బయటనుంచి తెచ్చుకోవాలని వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో జనాలు మెడికల్ షాపులకు వెళ్లి సిరంజీలు తెచ్చుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్స్ వేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనిపై జనాలు మండిపడుతున్నారు.