Fake Vehicle Sticker : నగరంలో పోలీసుల తనిఖీలు.. దొంగ స్టిక్కర్స్ వాహనాలపై నిఘా

ప్రతొక్క వాహనం కాకుండా.. స్టిక్కర్లు ఉన్న వాటిని మాత్రం ఆపి తనిఖీలు చేస్తుండడం గమనార్హం. ఇటీవలే దొంగ స్టిక్కర్లు అంటించుకుని...

Fake Vehicle Sticker : నగరంలో పోలీసుల తనిఖీలు.. దొంగ స్టిక్కర్స్ వాహనాలపై నిఘా

Vehicals Stickers

Hyderabad Traffic Police : నగరంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతొక్క వాహనం కాకుండా.. స్టిక్కర్లు ఉన్న వాటిని మాత్రం ఆపి తనిఖీలు చేస్తుండడం గమనార్హం. ఇటీవలే దొంగ స్టిక్కర్లు అంటించుకుంటూ రయ్యి రయ్యి మంటూ వాహనాలు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎమ్మెల్యే పేరిట ఉన్న కారు బీభత్సానికి ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కారు ఎమ్మెల్యే షకీల్ పేరిట ఉందని తేలింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 2022, మార్చి 19వ తేదీ శనివారం రాత్రి భారీగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రెస్, ఆర్మీ, పోలీస్, ఎమ్మెల్యే స్టిక్కరింగ్ ఉన్న వాహనాలను ఆపుతున్నారు. వాహనం వారిదేనా ? కాదా ? అనే దానిపై ఆరా తీస్తున్నారు. దొంగ స్టిక్కర్స్ అంటించుకుని తిరుగుతున్న వాహనాలపై నిఘా పెడుతున్నారు.

Read More : జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో పురోగతి

జూబ్లీ హిల్స్ లో కారు ప్రమాద కేసులో పురోగతి సాధించారు పోలీసులు. డ్రైవింగ్ చేసింది సయ్యద్ ఆఫ్నాన్ గా నిర్ధారించారు. స్థానికులు, బాధితుల సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఆప్నాన్ తో పాటు రసూల్ ను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ కారు ప్రమాదం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అసలు ఏం జరుగుతుందో, నేరస్థులెవరో తెలియని అయోమయం నెలకొంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసినా.. వారే ఆ కారు నడిపారా..? లేక ఇంకా ఎవరినైనా తప్పించడానికి వీరిని అరెస్టు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు యాక్సిడెంట్‌ కేసులో.. మీర్జా, అతని కుమారుడిని అరెస్టు చేసినట్టు చెబుతున్నారు పోలీసులు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎమ్మెల్యే షకీల్ కామెంట్స్‌ అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. గురువారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగింది. ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ చూసి, షకీల్‌కు ఫోన్‌ చేశారు పోలీసులు. గంటన్నర తర్వాత, ఆ కారు తనకు తెలిసిన దూరపు వాళ్లదని చెప్పాడు షకీల్. ఆ తర్వాత.. అది తన ఫ్రెండ్‌ కారని మాట మార్చారు. ఆ తర్వాతేమో.. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో, తన ఫ్రెండ్ కారు తీసుకున్నాడని చెప్పారు. అసలు కారులో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది.