‘నేను గే కాదు.. ట్రాన్స్‌ వుమన్ ని‌’: బాలీవుడ్‌ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్వప్నిల్‌ షిండే

‘నేను గే కాదు.. ట్రాన్స్‌ వుమన్ ని‌’: బాలీవుడ్‌ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్వప్నిల్‌ షిండే

‘I am not gay .. trans woman’:  Bollywood fashion designer Swapnil Shinde : ‘నేను గే కాదు.. ట్రాన్స్‌ వుమన్‌’ ని అని ప్రకటించారు బాలీవుడ్‌ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్వప్నిల్‌ షిండే. నా పేరును సైషా షిండేగా మార్చుకున్నట్లు వెల్లడించారు. సర్జరీ చేయించుకుని మహిళగా మారినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు దీపికా పదుకొనె, కరీనా కపూర్‌, శ్రద్ధ కపూర్‌, సన్నీ లియోన్‌, మాధురీ దీక్షిత్‌, ప్రియాంక చోప్రా, భూమి ఫడ్నేకర్‌, హీనా ఖాన్‌ లాంటి అగ్రనటులకు స్వప్నిల్‌ ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈ మహామహుల ఆహ్యార్యంలోని అందం..హుందాతనం వెనుకు సైషా షిండే అలియాస్ స్వప్నిల్‌ షిండే హస్తం ఉంది.
ఫ్యాషన్ ప్రపంచంలోనే తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు స్వప్నిల్ పాండే. సరికొత్త ఫ్యాషన్‌ డిజైన్లతో స్టార్ల మనసు దోచుకున్నారు స్వప్నిల్‌. స్విప్నిల్ షిండే గే అని గతంలో పలు వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్వప్నిల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ‘నేను గే కాదు.. ట్రాన్స్‌ వుమన్ ని ‌’ అని ప్రకటించారు. ‘‘మనం ఎక్కడ ఉన్నామన్న స్థాయితోను..పరిస్థితులతోను మన గతానికి ఏమాత్రం సంబంధం ఉండదు. వాటితో సంబంధం లేకుండా మన బాల్యం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకువస్తూనే ఉంటాయి. మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నా గతం నేను ఎదుర్కొన్న ఒంటరితనాన్ని గుర్తుచేస్తుంటుంది. ఏకాంతంలో గడిపేలా నాపై ఒత్తిడి తెచ్చిన ఆనాటి పరిస్థితులు గుర్తుకువస్తాయి. స్కూళ్లో, కాలేజీలో అబ్బాయిలంతా నన్ను కాస్త తేడాగా చూసేవారు. గేలి చేసేవారు.

అప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితులు నన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసేవి. నేను జీవిస్తున్న జీవితం నాది కాదు అనే భావన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేది. కానీ ఏం చేయాలో తెలిసేది కాదు. ఈ సంకట పరిస్థితుల్లోకొట్టుమిట్టాడేవాడ్ని. సమాజంలో ఉన్న హోదా నిలబెట్టుకోవడం కోసం ప్రతిరోజూ ప్రతిక్షణం మానసిక ఆందోళనకు గురయ్యాను.
20 ఏళ్ల వయస్సులో నిఫ్ట్‌లో చేరిన సమయంలో నా గురించి నాకు తెలిసిన నిజాన్ని నేను అంగీకరించాను.

అప్పుడే నేను మానసికంగా వికసించాను. అబ్బాయిల వైపు ఆకర్షితుడిని అవుతున్న కారణంగా గే అనుకున్నాను. గుర్తించాను. కానీ ఆరేళ్ల క్రితమే నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఇప్పుడు ‘‘నేను గే మాన్‌ కాదు.. ట్రాన్స్‌ వుమన్‌ను’’.. నా పేరు సైషా.. అంటే అర్థవంతమైన జీవితం అని అర్థం’’ అని సుదీర్ఘ పోస్టు ద్వారా తన మనోభావాలు వెల్లడించారు బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్‌ షిండే… కాదు కాదు ‘‘సైషా షిండే’’.