Dolo-650: ‘డోలో-650’ తయారీ కంపెనీపై ఐటీ దాడులు

దాదాపు 20 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. బెంగళూరుతోపాటు ఢిల్లీ, సిక్కిం, గోవా, పంజాబ్, తమిళనాడుల్లో ఉన్న సంస్థకు చెందిన 40 కార్యాలయాల్లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో దాదాపు 200 మంది సిబ్బంది పాల్గొన్నారు.

Dolo-650: ‘డోలో-650’ తయారీ కంపెనీపై ఐటీ దాడులు

Dolo 650

Dolo-650: ఆదాయపు పన్ను ఎగ్గొట్టారనే అనుమానంతో ‘డోలో-650’ ట్యాబ్లెట్ల తయారీ సంస్థ అయిన మైక్రో ల్యాబ్స్ కార్యాలయంపై ఐటీ (ఆదాయపు పన్ను) శాఖ దాడులు చేసింది. బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. దాదాపు 20 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. బెంగళూరుతోపాటు ఢిల్లీ, సిక్కిం, గోవా, పంజాబ్, తమిళనాడుల్లో ఉన్న సంస్థకు చెందిన 40 కార్యాలయాల్లో కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో దాదాపు 200 మంది సిబ్బంది పాల్గొన్నారు.

SpiceJet: వరుసగా విమాన ప్రమాదాలు.. స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

సంస్థ సీఎమ్‌డీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానాల ఇళ్లల్లో కూడా దాడులు నిర్వహించారు. రెండేళ్లుగా జరిగిన లావాదేవీలకు సంబంధించి పన్నులు ఎగ్గొట్టారనే అనుమానంతో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు కొన్ని విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 2020లో కోవిడ్ వచ్చినప్పటి నుంచి డోలో-650 ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 350 కోట్ల ట్యాబ్లెట్లు అమ్మినట్లు సమాచారం. వీటి ద్వారా సంస్థకు ఏడాదిలో దాదాపు రూ.400 కోట్ల ఆదాయం సమకూరింది. డోలో అమ్మకాల పరంగా ఇతర కంపెనీల రికార్డుల్ని ఈ సంస్థ బ్రేక్ చేసింది.