Agnipath: ‘అగ్నిప‌థ్’ కింద వైమానిక ద‌ళంలో ఉద్యోగాల‌కు 6 రోజుల్లో 2 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు

అగ్నిప‌థ్ ప‌థ‌కానికి ఉద్యోగార్థుల నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం ఈ ప‌థ‌కాన్ని ఇటీవ‌లే ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాలంటూ ఉద్యోగార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల్లో పాల్గొని హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ, అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద భార‌తీయ వైమానిక ద‌ళం ఆరు రోజుల క్రితం నియామ‌కాల ప్ర‌క్రియ ప్రారంభించింది.

Agnipath: ‘అగ్నిప‌థ్’ కింద వైమానిక ద‌ళంలో ఉద్యోగాల‌కు 6 రోజుల్లో 2 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు

Iaf

Agnipath: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన అగ్నిప‌థ్ ప‌థ‌కానికి ఉద్యోగార్థుల నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. త్రివిధ ద‌ళాల్లో నియామ‌కాల కోసం ఈ ప‌థ‌కాన్ని ఇటీవ‌లే ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకోవాలంటూ ఉద్యోగార్థులు దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల్లో పాల్గొని హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ, అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద భార‌తీయ వైమానిక ద‌ళం (ఐఏఎఫ్) ఆరు రోజుల క్రితం నియామ‌కాల ప్ర‌క్రియ ప్రారంభించింది.

Maharashtra political crisis : పతనం అంచున ఉద్ధవ్ ప్రభుత్వం..‘మహా’ రాజకీయాల భీష్మాచార్యుడు శరద్ పవార్ తక్షణ కర్తవ్యం ఏంటీ?

దీనికి ఆరు రోజుల్లో 2,01,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయని ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధి భ‌ర‌త్ భూష‌ణ్ బాబు ట్విట‌ర్ ద్వారా తెలిపారు. ఐఏఎఫ్‌లో ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌డానికి వ‌చ్చే నెల‌ 5 వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ ప‌థ‌కం కింద కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నాలుగేళ్ళ పాటు మాత్ర‌మే సైన్యంలో కొనసాగే అవ‌కాశం ఉంటుంది. అయితే, అగ్నిప‌థ్ కింద ఉద్యోగం చేసిన వారికి రాష్ట్ర పోలీసు స‌ర్వీసుల్లో ప్రాధాన్యం ఇస్తామ‌ని ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి.