Abhishek Singh : యాక్టర్ గా మారిన IAS ఆఫీసర్

సినిమాల్లో యాక్టింగ్ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు ఎవరికీ ఎలా వస్తుందో చెప్పలేము. అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు కూడా యాక్టర్స్............

Abhishek Singh : యాక్టర్ గా మారిన IAS ఆఫీసర్

Abhishek

Abhishek Singh :  మనలో చాలా మందికి మనకి తెలియకుండానే ఒక కళ ఉంటుంది. కొంతమంది ఆ కళని గుర్తించి అటువైపు ప్రయాణం సాగిస్తారు. మరి కొంతమంది చదువులు, జాబ్ అంటూ మరో సైడ్ గోల్స్ పెట్టుకొని సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే సినిమాల్లో యాక్టింగ్ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు ఎవరికీ ఎలా వస్తుందో చెప్పలేము. అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు కూడా యాక్టర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. ఓ IAS ఆఫీసర్ యాక్టర్ గా ఎలా మారాడో మీరే తెలుసుకోండి.

 

అభిషేక్‌ సింగ్‌.. చూడటానికి హీరోలా ఉంటాడు. అభిషేక్ సింగ్‌ తండ్రి ఉత్తరప్రదేశ్‌ స్టేట్‌ పోలీస్‌ సర్వీస్‌లో పని చేసేవాడు. దీంతో ఆయన ప్రభావం వల్లే చిన్నప్పటి నుంచీ ఐఏఎస్‌ సాధించాలని కలలు కని సాధించాడు. ఢిల్లీలో IAS ఆఫీసర్ గా భాద్యతలు నిర్వహిస్తున్న టైంలో ఒకసారి అధికారిక పని మీద ముంబైకి వెళ్లగా అప్పుడు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, తన ఫ్రెండ్ అయిన ముకేశ్ ని కలవడానికి వెళ్ళాడు. అదే సమయంలో ముకేశ్ దగ్గరికి నెట్ ఫ్లిక్స్ టీం ‘ఢిల్లీ క్రైమ్‌-2’ సిరీస్ వర్క్ కోసం వచ్చింది. వాళ్ళు అభిషేక్ ని, అతని బాడీ కటౌట్, అందం చూసి నటుడు అనుకోని ‘ఢిల్లీ క్రైమ్‌-2’లో నటించమని అడిగారు. అతను యాక్టర్ కాదు IAS అని అసలు సంగతి చెప్పాక ఆశ్చర్యపోయారు. అయినా వదలకుండా ‘ఢిల్లీ క్రైమ్‌-2’లో IAS ఆఫీసర్ పాత్ర ఉంది వేయమని ఒప్పించారు. అలా యాక్టింగ్ లోకి ఎంటర్ అయ్యాడు అభిషేక్ సింగ్.

Anchor Suma : జయమ్మ పంచాయతీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఇక ఆ సీజన్ తర్వాత తనకి వరుసగా ఛాన్సులు వచ్చాయి. ఒక పక్క సిరీస్, సినిమాల్లో నటిస్తూ కొన్ని రోజులు ఉద్యోగాన్ని మేనేజ్ చేశాడు. కానీ తర్వాత కుదరకపోవడంతో ఉద్యోగాన్ని వదిలేసి యాక్టింగ్ వైపు వచ్చాడు. ఒక మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ చేయగా అది యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సంపాదించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘ఫ్యాషన్‌ వీక్‌- 2022’లో ర్యాంప్‌ వాక్ చేసి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు అభిషేక్.

Rukshar Dhillon : ప్రేమ పెళ్లి చేసుకుంటాను.. నాకు అలాంటి అబ్బాయి కావాలి..

నటుడిగా మారిన ఈ IAS ఆఫీసర్ కరోనా సమయంలో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. రక్తదాన కార్యక్రమాలు, ఆక్సిజన్‌ ఏర్పాట్లు చేసి వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోనూ పాల్గొని ప్రచారం చేశాడు. అంతేకాక ఇప్పటికి పలు సంస్థలకు IAS ఆఫీసర్ హోదాలో సలహాదారుడిగా కూడా ఉన్నారు. ఇతనికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అభిషేక్ భార్య దుర్గాశక్తి నాగపాల్‌ కూడా ఐఏఎస్‌ అధికారే కావడం విశేషం.