Virat Kohli: కోహ్లీ ఒక్క 20నిమిషాలు టైమిస్తే సాయం చేస్తా – గవాస్కర్

టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. తాను విరాట్ కోహ్లీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఫామ్ కోల్పోయిన విరాట్‌కు అతని ఇన్‌పుట్స్ ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.

Virat Kohli: కోహ్లీ ఒక్క 20నిమిషాలు టైమిస్తే సాయం చేస్తా – గవాస్కర్

 

 

Virat Kohli: టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. తాను విరాట్ కోహ్లీకి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ ఫామ్ కోల్పోయిన విరాట్‌కు అతని ఇన్‌పుట్స్ ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకున్న నేపథ్యంలో మాట్లాడిన గవాస్కర్ ఒక్క 20నిమిషాల సమయం దొరికితే చాలంటున్నాడు.

రీసెంట్ గా విరాట్ కోహ్లీ ఎదుర్కొంటున్న ఆఫ్ స్టంప్ సమస్యను అధిగమించేందుకు గవాస్కర్ దగ్గర ఐడియా ఉందట. విరాట్ అతని కెరీర్ లోనే అత్యంత దారుణమైన ఫేజ్ కు చేరుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు వన్డేలకు కలిపి 33 పరుగులు మాత్రమే నమోదు చేశాడు విరాట్. టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్ లలో 12పరుగులు నమోదు చేశాడు. బర్మింగ్ హామ్ టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ఆడి 31పరుగులు మాత్రమే చేశాడు.

“అతనితో సుమారు 20 నిమిషాలు గడిపితే, అతను చేయాల్సినవి చెప్పగలను. కచ్చితంగా సహాయపడుతుందని చెప్పడం లేదు, కానీ సహాయపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ఆఫ్ స్టంప్‌కు సంబంధించి” అని గవాస్కర్ మీడియాతో అన్నారు.

Read Also: ఫ్యాన్‌ను తిట్టిపోసిన విరాట్ కోహ్లీ

“కోహ్లీ ఫామ్ గురించి ఎదురుచూడక తప్పదు. ఎందుకంటే ఇండియా తరపున 70 అంతర్జాతీయ సెంచరీలను నమోదు చేవాడు. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా అన్ని ఫార్మాట్లలో రాణించాడు. సహనం పాటించాలి. ఒక ప్లేయర్ 32..33 ఏళ్లు వచ్చాయంటే అందరూ అంతే. కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం కొన్ని ఓటములను ఓర్చుకోవాలి” అన్నారాయన.