Naga Panchami : కాల సర్ప దోషాలు తొలగిపోవాలంటే నాగపంచమి రోజున ఏంచేయాలి…

నాగపంచమిరోజున పాముల నివాసస్ధానాలైన పుట్టలకు పూజలు చేస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం నిర్వహిస్తారు.

Naga Panchami : కాల సర్ప దోషాలు తొలగిపోవాలంటే నాగపంచమి రోజున ఏంచేయాలి…

Naga Panchmi

Naga Panchami : ప్రకృతిలోని సమస్త జీవరాశిని అరాధించటమన్నది అనాదిగా వస్తున్న అచారం. మానవాళి మనుగడకు ఉపయోగపడే చెట్టు, పుట్ట,జంతుజాలాన్ని పూజలు చేయటం మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైపోయాయి. హిందూ సాంప్రదాయంలో నాగపంచమికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మదేవుడు ఆది శేషుని అనుగ్రహించిన రోజుగా ఈ దినాన్ని పరిగణిస్తారు.

త్రేతాయుగంలో లక్ష్మణుడిగాను, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడని పురాణ గాధలు చెబుతున్నాయి. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్ధనం చేసిన రోజునే నాగపంచమిగా , గరుడ పంచమిగా జరుపుకుంటుంటారు. కశ్యప ప్రజాపతి వినత, కద్రువలనే ఇద్దరు భార్యలను కలిగిఉంటాడు. వీరి సంతానమే గరుత్మంతుడు, నాగులు. శ్రావణ మాసం పంచమి రోజునే వినతకు గరుత్మంతుడు, కద్రువకు నాగులు జన్మించటం వల్ల ఆరోజును నాగపంచమి, గరుడ పంచమిగా పిలుస్తారు.

నాగపంచమిరోజున పాముల నివాసస్ధానాలైన పుట్టలకు పూజలు చేస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం నిర్వహిస్తారు. నాగపంచమి రోజున మట్టి తవ్వటం, చెట్లను నరకడం వంటివి చేయకూడదని చెప్తారు. నాగపంచమి రోజున సర్ప పూజ చేస్తే కాల్పసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. పుట్టలో పాలు పూసి సర్ప పూజ చేసిన వారికి సంతానప్రాప్తి, రాహు,కేతు దోషాలు తొలగిపోతాయి.

పంచమి రోజున నాగదేవతలను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేధ్యంగా సమర్పిస్తారు. పంగలంతో ఉపవాసాలతో గడిపి రాత్రి సమయంలో ఆహారం తీసుకోవాలి. అలాగే సర్ప స్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియ రోగాలు తొలగిపోతాయి. పంచమి రోజున తెల్లవారుజామునే నిద్రలేని ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానాలు చేసి పుట్ట వద్దకు వెళ్ళి పూజలు నిర్వహిస్తారు. పాలు, పండ్లు, నాగ పడిగెలు, నువ్వులు, జొన్నపెలాలు, పంచామృతాన్ని నాగదేవతకు నైవేధ్యంగా సమర్పిస్తారు.