Dengue Precautions : డెంగీ లక్షణాలు గుర్తించిన వెంటనే ఈ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చు!

డెంగీ వచ్చిన వారికి విపరీతమైన చలితో కూడిన జ్వరం ఉంటుంది. జ్వరం వచ్చిన రెండో రోజున చర్మం ఎరుపెక్కి మంటగా ఉంటుంది. దాహం విపరీతంగా అవుతుంది. నోరు ఎక్కువగా తడారిపోతుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఉంటాయి. శరీరంపై ఎరుపు రంగులో దద్దుర్లు వస్తాయి. పిల్లల్లో నోరు పొక్కడం, గొంతునొప్పి, పొడి దగ్గులాంటి లక్షణాలు కనిపిస్తాయి.

Dengue Precautions : డెంగీ లక్షణాలు గుర్తించిన వెంటనే ఈ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చు!

Dengue Precautions :

Dengue Precautions : డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే వైరల్ వ్యాధి ఇది. వర్షకాలంలో దోమల తాకిడి అధికంగా ఉన్న నేపధ్యంలో డెంగ్యూ దోమలు కారణంగా డెంగ్యూ వ్యాప్తి అధికమౌతుంది. డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో రక్తస్రావం, అవయవవాల పనితీరు మందగించడం, ప్లాస్మా లీకేజీ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చు. తీవ్రమైన డెంగ్యూకి తగిన చికిత్స అందించకపోతే బాధితులు మరణించే ప్రమాదం ఉంది. డెంగ్యూ అనేది తీవ్రమైన ఫ్లూకు దారితీస్తుంది దోమ కాటు తర్వాత వ్యాధి సోకిన వారిలో 10 రోజుల వరకు వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 2-7 రోజుల పాటు లక్షణాలు ఉంటాయి.

డెంగీ వచ్చిన వారికి విపరీతమైన చలితో కూడిన జ్వరం ఉంటుంది. జ్వరం వచ్చిన రెండో రోజున చర్మం ఎరుపెక్కి మంటగా ఉంటుంది. దాహం విపరీతంగా అవుతుంది. నోరు ఎక్కువగా తడారిపోతుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఉంటాయి. శరీరంపై ఎరుపు రంగులో దద్దుర్లు వస్తాయి. పిల్లల్లో నోరు పొక్కడం, గొంతునొప్పి, పొడి దగ్గులాంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు అవుతుంటాయి. కళ్లు నొప్పిగా అనిపిస్తాయి. కడుపు నొప్పి, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే ;

వైద్య పరీక్షల్లో డెంగీ ఉందని తేలితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. డెంగీ వచ్చిన వారు రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే వ్యాధి నుంచి త్వరగా బయట పడవచ్చు. తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రాక్ష, కివీలు, దానిమ్మ, నారింజ పండ్లను బాగా తీసుకుంటే డెంగీ నుంచి త్వరగా కోలుకోవచ్చు. రెండు, మూడు రకాల కూరగాయలను గ్రైండ్‌ చేసి వాటి రసం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

రోగి శరీరాన్ని చల్లని గుడ్డతో తుడుస్తుండాలి. జ్వరం వచ్చిన వారిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతుండాలి. డెంగీ రావడం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు వైద్యులు ప్లేట్లను పెంచేందుకు మందులు ఇస్తారు. వాటితోపాటు బొప్పాయి ఆకుల రసాన్ని చాలా స్వల్ప మోతాదులో సేవిస్తుండాలి. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. నూనె పదార్థాలు, వేపుడ్లు, కెఫిన్‌, కార్బొనేటెడ్‌ పానీయాలు, కారం వస్తువులు తినకుండా చూసుకోవాలి. కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను డెంగ్యూ జ్వరం తగ్గేంత వరకు తీసుకోకపోవడమే మంచిది.