Amarinder Singh: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. బీజేపీలోకి మాజీ సీఎం అమరీందర్ సింగ్!

పంజాబ్‌లో పాలక కాంగ్రెస్ సుదీర్ఘ అంతర్గత జగడం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కెప్టెన్ అమరీందర్ సింగ్.

Amarinder Singh: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. బీజేపీలోకి మాజీ సీఎం అమరీందర్ సింగ్!

Amarindhar

Amarinder Singh: పంజాబ్‌లో పాలక కాంగ్రెస్ సుదీర్ఘ అంతర్గత జగడం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కెప్టెన్ అమరీందర్ సింగ్. రాజీనామా తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ కోసం కొత్త పాచికలు వేస్తుంది భారతీయ జనతా పార్టీ(BJP) నాయకత్వం. అతని నాలుగున్నర సంవత్సరాల పదవీకాలంలో అతనిపై నిరంతరం దాడి చేసిన బీజేపీ.. ఇప్పుడు అతని నిష్క్రమణను “రాజకీయ హత్య” గా అభివర్ణిస్తుంది. “జాతీయవాద” నాయకుడిని తన “గేమ్‌ప్లాన్”లో కాంగ్రెస్ తొలిగించింది అని అభిప్రాయం వ్యక్తం చేసింది బీజేపీ.

మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలపై పంజాబ్ రాష్ట్రంలో నిరసనలపై అమరీందర్ సింగ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కాషాయం పార్టీ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ చిత్రాన్ని మార్చే ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరియు ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వాతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్నేహాన్ని ప్రశ్నిస్తూ అమరీందర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ సమర్ధిస్తోంది.

పంజాబ్ సిఎం పదవికి రాజీనామా చేసిన తరువాత, అమరీందర్ మాట్లాడుతూ.. సిద్ధూ “ప్రమాదకరమైనవాడు” మరియు “దేశ వ్యతిరేకుడు” కనుక సిద్దూ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదని అభిప్రాయపడ్డారు. “సిద్దూ ఇమ్రాన్ ఖాన్ మరియు జనరల్ బజ్వాను కౌగిలించుకోవడం మరియు కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం మనమందరం చూశాము. ప్రతిరోజూ సరిహద్దుల్లో మా సైనికులు మరణిస్తున్నారని అమరీందర్ అన్నారు.

అంతేకాదు.. సెప్టెంబర్ 18వ తేదీన రాజీనామా తర్వాత అమరీందర్ మాట్లాడిన సంధర్భంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకపోవడంతో బీజేపీ వైపు అమరీందర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బీజేపీ చెబుతోంది. అమరీందర్‌ని బిజెపి గట్టిగా సమర్థించడం చూస్తుంటే, ఈయన భారతీయ జనతా పార్టీలో చేరతారా? అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో పెరిగాయి.