Amazon : అమెజాన్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ..

ప్రస్తుతం డెల్టా వేరియంట్ కోవిడ్ ప్రాణాంతకంగా మారి ప్రపంచదేశాల ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం 135 దేశాలు ఈ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు.

Amazon : అమెజాన్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ..

Amazon

Amazon : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో ఉద్యోగులు వచ్చే ఏడాది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగించాలని సూచించింది. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఇంటి నుండే విధులు నిర్వర్తించాలని తన ఉద్యోగులకు అమెజాన్ అదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం డెల్టా వేరియంట్ కోవిడ్ ప్రాణాంతకంగా మారి ప్రపంచదేశాల ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం 135 దేశాలు ఈ మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీ ఆఫ్ అలబామా పరిశోధకులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు అమెరికాలో సైతం కోవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో  గతంలో తీసుకున్న నిర్ణయంపై అమెజాన్ కంపెనీ ప్రతినిదులు చర్చించారు.

ప్రపంచ దేశాల్లో కోవిడ్ పరిస్ధితులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అంచనావేస్తోంది. డెల్టా కేసుల ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఉద్యోగులను తిరిగి సెప్టెంబర్ లో కార్యాలయాలకు రావాలంటూ తీసుకున్న నిర్ణయంపై అమెజాన్  పున;సమీక్ష జరిపింది. ఆమేరకు 2022 జనవరి 3వరకు ఇంటి నుండే విధులు నిర్వహించాలని అమెజాన్ ప్రతినిధులు ఉద్యోగులకు సంకేతాలు పంపారు.