Groom Escape : మరో గంటలో పెళ్లి.. రూ. 25 లక్షలు, 25 తులాల బంగారంతో పారిపోయిన వరుడు!

మరో గంటలో వివాహం అనగా.. కట్నం డబ్బు, నగలతో వరుడు పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరగ్గా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడికోసం గాలింపు చేపట్టారు.

Groom Escape : మరో గంటలో పెళ్లి.. రూ. 25 లక్షలు, 25 తులాల బంగారంతో పారిపోయిన వరుడు!

Groom Escape

Updated On : December 16, 2021 / 10:40 AM IST

Groom Escape : మరో గంటలో వివాహం ఉండగా కట్నం డబ్బుతో ఉడాయించాడు వరుడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కంది మండలం, చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం, మల్కాపూర్‌కు చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. పెళ్లిరోజు రానేవచ్చింది. బంధువులు, స్నేహితులు పెళ్లిమండపానికి తరలివచ్చారు.

చదవండి : Sangareddy : భార్యలు తిట్టారని ఇద్దరు భర్తలు ఆత్మహత్య

మరో గంటలో వివాహం జరగాల్సి ఉండగా.. రూ.25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. మోసపోయామని తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ విషయం బయటికి తెలియడంతో మాణిక్‌రెడ్డి కుటుంబ సభ్యులు పరువు పోయిందని భావించి ఊరు విడిచి వెళ్లిపోయారు. పారిపోయిన వరుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

చదవండి : Sangareddy : ట్రైనింగ్ నర్సును వేధించాడు…వేటు పడింది