Ind Vs Eng T20 Womens World Cup : ఉత్కంఠపోరులో భారత్ ఓటమి

మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఉత్కంఠపోరులో భారత్ ఓటమిపాలైంది. 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విక్టరీ కొట్టింది. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది.

Ind Vs Eng T20 Womens World Cup : ఉత్కంఠపోరులో భారత్ ఓటమి

Updated On : February 18, 2023 / 10:37 PM IST

Ind Vs Eng T20 Womens World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఉత్కంఠపోరులో భారత్ ఓటమిపాలైంది. 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విక్టరీ కొట్టింది. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది.

టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన హాఫ్ సెంచరీతో రాణించింది. 41 బంతుల్లో 52 పరుగులు చేసింది. రిచా ఘోష్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 34 బంతుల్లో 47 పరుగులు చేసింది. వీరిద్దరూ రాణించినప్పటికీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. చివరలో రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి లోనయ్యారు బ్యాటర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

ఈ గెలుపుతో ఇంగ్లాండ్ సెమీస్ కి చేరింది. కాగా, భారత్ సెమీస్ చేరాలంటే తదుపరి మ్యాచ్ లో ఐర్లాండ్ పై భారీ విజయాన్ని నమోదు చేయాల్సిందే.