Ind Vs Ire Womens T20 World Cup : వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన భారత్, కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీస్ చేరింది. కీలక మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం సాధించి సెమీస్ బెర్తు ఖాయం చేసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 పరుగుల(డక్ వర్త్ లూయిస్) తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ నెగ్గిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

Ind Vs Ire Womens T20 World Cup : వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన భారత్, కీలక మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై విజయం

Ind Vs Ire Womens T20 World Cup : ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు సెమీస్ చేరింది. కీలక మ్యాచ్ లో ఐర్లాండ్ పై విజయం సాధించి సెమీస్ బెర్తు ఖాయం చేసింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 5 పరుగుల(డక్ వర్త్ లూయిస్) తేడాతో విక్టరీ కొట్టింది. టాస్ నెగ్గిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

ఓపెనర్ స్మృతి మందాన హాఫ్ సెంచరీతో చెలరేగింది. 56 బంతుల్లోనే 87 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. 8.2ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్దతితో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచినట్లు ప్రకటించారు.

Also Read..Ind Vs Aus 2nd Test: బెడిసికొట్టిన ఆసీస్ ప్లాన్.. ఆ రెండు షాట్లు కొంపముంచాయి ..

సోమవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ విధానంలో 5 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్.. తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఐర్లాండ్ లక్ష్యఛేదనలో 8.2 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం విజేతను డిసైడ్ చేశారు అంపైర్లు.

వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఐర్లాండ్ స్కోరు 2 వికెట్లకు 54 పరుగులు. డీఎల్ఎస్ ప్రకారం అప్పటికి 59 పరుగులు చేసుంటే ఐర్లాండే గెలిచేది. కానీ, ఐర్లాండ్ 5 పరుగులు వెనుకబడి ఉంది. దాంతో భారత్ ను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో టీమిండియా అమ్మాయిలు సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్నారు.(Ind Vs Ire Womens T20 World Cup)

Also Read..Chetan Sharma Resigned: క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్..! బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా..

ఐర్లాండ్ తో కీలక మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన విజృంభించింది. 56 బంతుల్లోనే 87 పరుగులు చేసింది. ఆమె స్కోరులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో ఇతర బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయకపోవడంతో భారత్ కు భారీ స్కోరు సాధ్యం కాలేదు. మొత్తమ్మీద నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లకు 155 పరుగులు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 24(29 బంతులు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 13(20 బంతుల్లో), జెమీమా రోడ్రిగ్స్ 19(12 బంతుల్లో) పరుగులు చేశారు. రిచా ఘోష్, దీప్తి శర్మ డకౌట్ అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో కెప్టెన్ లారా డెలానీ 3 వికెట్లు తీసింది. ఓర్లా ప్రెండెర్ గాస్ట్ 2, ఆర్లెన్ కెల్లీ 1 వికెట్ పడగొట్టారు.