Chetan Sharma Resigned: క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్..! బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా..

టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జేషాకు పంపారు.

Chetan Sharma Resigned: క్రికెటర్లపై వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్..! బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా..

Chetan Sharma Resigned

Chetan Sharma Resigned: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జేషాకు పంపారు.  ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్ ప్రూవ్ చేసుకునేందుకు ఇంజెక్షన్లు వాడుతారని, డోపింగ్ టెస్టులో అవి దొరకవని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక.. చేతన్ శర్మ ఆటగాళ్ల మధ్య విబేధాలపైనా ప్రస్తావించాడు. చేతన్ వ్యాఖ్యలు టీమిండియా క్రికెట్ లో సంచలనంగా మారాయి. బీసీసీఐ పెద్దలు చేతన్ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్నట్లు.. అతనిపై  వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ క్రమంలో చేతన్ శర్మ తనంతటికి తానే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Chetan Sharma: కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విబేధాలు.. స్టింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెల్లడించిన చేతన్ శర్మ

ఓ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ వివాదాస్పదన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో బయటకు రావటంతో సంచలనంగా మారింది. విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి ఆటగాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, కోచ్ ద్రవిడ్, విరాట్ కోహ్లీతో శర్మ అంతర్గత చర్చలను వెల్లడించారు. మాజీ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, మాజీ టీమిండియా కెప్టెన్ కోహ్లీ మధ్య గ్యాప్ పెరగడానికి వారిలో ఇగో కారణమని చేతన్ వీడియోలో పేర్కొన్నాడు.

IND vs AUS 2nd Test Match: వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన ఆసీస్.. మూడు వికెట్లు డౌన్.. .. .. Live Updates

టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసిన కోహ్లీ.. బీసీసీఐ‌పై పైచేయి సాధించాలని భావించాడని, దీనివల్లే గంగూలీ, కోహ్లీ మధ్య గ్యాప్ పెరిగిందని అన్నాడు.  టీమిండియాలో రెండు గ్రూపులు ఉన్నాయని, వాటికి రోహిత్ శర్మ, కోహ్లీ నాయకత్వం వహిస్తారంటూ చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలో చేతన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  బీసీసీఐ చేతన్ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే చేతన్ బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.