Ind Vs Aus 2nd Test: బెడిసికొట్టిన ఆసీస్ ప్లాన్.. ఆ రెండు షాట్లు కొంపముంచాయి ..

రెండో టెస్టులోనూ ఆసీస్ ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో రెండో టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, రెండో టెస్టుకు ముందు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు రెండు ప్లాన్లు అమలు చేయాలని భావించారు. అనుకున్నట్లుగా ఆసీస్ బ్యాటర్లు అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్‌లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడారు. అయితే, వారు అనుకున్నట్లు ఇవి ఫలితాన్ని ఇవ్వకపోగా త్వరగా అవుట్ అయ్యారు.

Ind Vs Aus 2nd Test: బెడిసికొట్టిన ఆసీస్ ప్లాన్.. ఆ రెండు షాట్లు కొంపముంచాయి ..

IND vs AUS Test Match

Ind Vs Aus 2nd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఇండియాలో జరుగుతుంది. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తికాగా, ఈ రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. మరో విషయం ఏమిటంటే.. ఈ రెండు టెస్టుల్లోనూ ఇండియా మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించేసింది. తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్‌కు ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏమాత్రం క్రీజులో కుదురుకోలేక పోయారు. ఫలితంగా మొదటి టెస్టు భారీ పరుగుల తేడాతో ఆసీస్ ఓటమి పాలైంది. దీంతో భారత్ తమకు అనుకూలంగా స్పిన్ పిచ్ లను తయారు చేసుకుందని ఆ జట్టు మాజీలు విమర్శలుసైతం చేశారు.

IND vs AUS Test Match: రెండో టెస్టులో భారత్ విజయం.. 3వ రోజు ఆట ఫొటోలు ..

రెండో టెస్టులోనూ ఆసీస్ ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో రెండో టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, రెండో టెస్టుకు ముందు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు రెండు ప్లాన్లు అమలు చేయాలని భావించారు. అనుకున్నట్లుగా ఆసీస్ బ్యాటర్లు అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్‌లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడారు. అయితే, వారు అనుకున్నట్లు ఇవి ఫలితాన్ని ఇవ్వకపోగా త్వరగా అవుట్ అయ్యారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో చాలా మంది క్లీన్ బౌల్డ్ అయ్యారు. కొందరు ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాటపట్టారు.

India vs Australia 2nd Test Match: రెండో టెస్టునూ మూడు రోజుల్లో ముగించేశారు.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..

ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎంచుకున్న రెండు షాట్లపై క్రికెట్ నిపుణులు తప్పుబట్టారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు క్లీన్ బౌల్డ్ కావటం, ఇద్దరు ఎల్ బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యారు. ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, మాథ్యూ రెన్షా, పాట్ కమ్మిన్స్ సహా సగానికిపైగా ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్వీప్ లేదా రివర్స్ స్వీప్ ఆడుతూ అవుట్ అయ్యారు. ఈ విషయంపై పాక్ మాజీ క్రికెటర్ ఒకరు మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా చాలా తక్కువ స్థాయి ప్రతిభను కనబర్చింది. దీనికికారణం.. ఢిల్లీ తరహా పిచ్‌పై స్వీప్, రివర్స్ స్పీప్ షాట్లు ఆడటమే, ఈ షాట్లు ఆడే క్రమంలో ఆటగాళ్లు అవుట్ కావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఆసీస్ ఇండియా స్పిన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు ఎంపిక చేసుకున్న షాట్లే వారి కొప్పముంచాయని మాజీలు అభిప్రాయపడుతున్నారు.