Corona Vaccine : భారత్ మరో రికార్డు.. 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు నెలకొల్పింది. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.

Corona Vaccine : భారత్ మరో రికార్డు.. 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

Vaccine

100 crore people vaccinated : కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. నిన్న సాయంత్రం వరకు 99.7 కోట్ల డోసులు పంపిణీ చేసింది. నేడు 100 కోట్ల డోసులు పంపిణీ చేసింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.

275 రోజుల్లోనే 100 కోట్ల డోసుల ల్యాండ్ మార్క్ ను చేరుకుంది. రోజుకు 27 లక్షల డోసుల చొప్పున భారత్ లో టీకా పంపిణీ జరిగింది. ప్రస్తుతం భారత్ సెకన్ కు 700 డోసుల చొప్పున వేస్తోంది. 100 కోట్ల డోసులకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం సంబరాలు జరుపుతోంది.

Corona cases: బీ కేర్ ఫుల్.. కరోనా కేసులు పెరిగాయి..!

కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తోంది. వంద కోట్ల డోసుల పంపిణీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎర్ర కోట వద్ద 1400 కిలోల త్రివర్ణ పతాక ప్రదర్శన ఉంటుంది.

100 కోట్ల డోసుల పంపిణీ లక్ష్యాన్ని చేరిన సందర్భంగా ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, నౌకల్లో, మెట్రోల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై కైలాష్ కెహర్ రాసిన పాటను ఆవిష్కరించనున్నారు.