Booster Dose: విదేశాలు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్.. బూస్టర్ డోస్ గ్యాప్ తగ్గింపు
చదువు, ఉపాధితోపాటు వివిధ అవసరాల కోసం విదేశాలకు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వీళ్లంతా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కోసం, సెకండ్ డోస్ తర్వాత తొమ్మిది నెలలు ఆగాల్సిన అవసరం లేదు.

Booster Dose
Booster Dose: చదువు, ఉపాధితోపాటు వివిధ అవసరాల కోసం విదేశాలకు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వీళ్లంతా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కోసం, సెకండ్ డోస్ తర్వాత తొమ్మిది నెలలు ఆగాల్సిన అవసరం లేదు. భారతీయులు వెళ్లే విదేశాల్లో అమలవుతున్న నిబంధనలకు అనుగుణంగా ముందుగానే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. పద్దెనిమిదేళ్లు పైబడి, 59 ఏళ్ల లోపు వయసు వారికి బూస్టర్ డోస్‌ను కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పాత నిబంధనల ప్రకారం సెకండ్ డోస్ తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చు.
Zero Covid policy: డబ్ల్యూహెచ్ఓ పై మండిపడ్డ చైనా.. వారికి సలహాలివ్వడం నచ్చదట..
అయితే, వృద్ధులు, హెల్త్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ వంటివాళ్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. బూస్టర్ డోస్‌కు అర్హత కలిగిన పౌరులు ఎవరైనా ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. తాజాగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులు ఎవరైనా ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా ముందుగానే బూస్టర్ డోస్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.