Zero Covid policy: డబ్ల్యూహెచ్ఓ పై మండిపడ్డ చైనా.. వారికి సలహాలివ్వడం నచ్చదట..

చైనాకు సలహాలివ్వడం కంటే మరో పెద్దతప్పు ఇంకోటి లేదన్న విషయం డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ)కు ఇప్పుడు బోధపడినట్లుంది. చైనా ప్రభుత్వం ఆ దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ జీరో వ్యూహాన్ని...

Zero Covid policy: డబ్ల్యూహెచ్ఓ పై మండిపడ్డ చైనా.. వారికి సలహాలివ్వడం నచ్చదట..

Zero Covid Policy

Zero Covid policy: చైనాకు సలహాలివ్వడం కంటే మరో పెద్దతప్పు ఇంకోటి లేదన్న విషయం డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ)కు ఇప్పుడు బోధపడినట్లుంది. చైనా ప్రభుత్వం ఆ దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ జీరో వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు విధిస్తోంది. అయితే చైనా అమలు పరుస్తున్న కొవిడ్ జీరో వ్యూహంపై ఓసారి పునరాలోచించుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ చైనాకు సూచించారు. అదికూడా తప్పనట్లుగా డబ్ల్యూహెచ్ఓ పై ఆ దేశం మండిపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచన పై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. తమ విధానాన్ని సమర్థించుకున్నారు. డబ్ల్యూహెచ్ఓ ఈ తరహా బాధ్యతారహితమైన వ్యాఖ్యలు మానుకోవాలని హితవుపలికారు.

China president: చైనా అధ్యక్షుడికి వింత వ్యాధి.. మెదడులో రక్తనాళాలు ఎప్పుడైనా..

కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చైనా అనుసరిస్తున్న కొవిడ్ జీరో వ్యూహంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరంతరం మార్పులకు లోనవుతోన్న కరోనా వైరస్ కట్టడి విషయంలో చైనా అనుసరిస్తోన్న కొవిడ్ జీరో విధానం సమర్థనీయమైంది కాదని అన్నారు. కరోనా వైరస్ సరికొత్త మార్పులు సంతరించుకుంటూ మరింత వ్యాప్తి చెందుతోందని, దీనికి తగ్గట్టుగా మీ విధానంలో మార్పులు చేసుకోవడం ముఖ్యమని, కొవిడ్ జీరో విధానంపై పునరాలోచించాలని డబ్ల్యూహెచ్ఓ చైనాకు సూచించింది. ఈ సూచనలే చైనా ఆగ్రహానికి కారణమయ్యాయి.

China Covid : చైనాలో కోవిడ్ ఆంక్షలు అమలు చేయకపోతే కేసులు, మరణాలు పెరుగుతాయి

ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ అధిపతి టెడ్రోస్ ను ఉద్దేశించి చైనా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి చైనా అనుసరిస్తోన్న విధానంపై సహేతుకమైన అభిప్రాయం కలి ఉంటారని ఆశిస్తున్నామని అన్నారు. వాస్తవాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని భావిస్తున్నామంటూ ఆయన డబ్ల్యూహెచ్ఓ అధిపతిని ఓ రకంగా హెచ్చరించారు. డబ్ల్యూహెచ్ఓ అధిపతి పట్ల చైనా తీరును పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ మంచి సలహా ఇస్తే చైనా మాత్రం అతిగా స్పందించడం సరికాదంటూ మండిపడుతున్నారు.