Commonwealth Games: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌కు హాకీ టీమిండియా నో!!

కామెన్వెల్త్ గేమ్స్ 2022కు టీమిండియా హాకీ మెన్, ఉమెన్ టీంలు పార్టిసిపేట్ చేయడం లేదు. ఈ విషయాన్ని హాకీ ఇండియా ప్రెసిడెంట్ గ్యానంద్రో నింగోంబం ఫెడరేషన్ కు తెలియజేశారు.

Commonwealth Games: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌కు హాకీ టీమిండియా నో!!

Common Welth Games

Commonwealth Games: కామెన్వెల్త్ గేమ్స్ 2022కు టీమిండియా హాకీ మెన్, ఉమెన్ టీంలు పార్టిసిపేట్ చేయడం లేదు. ఈ విషయాన్ని హాకీ ఇండియా ప్రెసిడెంట్ గ్యానంద్రో నింగోంబం ఫెడరేషన్ కు తెలియజేశారు. ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ బాత్రా అన్నారు.

కామన్వెల్త్ గేమ్స్ కు వెళ్లకుండా ఆసియా గేమ్స్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. అలా చేయడం వల్ల 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించొచ్చని ప్లాన్ చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో మెన్స్ టీం గుర్తుండిపోయే ఫీట్ సాధించి కాంస్య పతకం దక్కించుకుంది. రాణి రాంపాల్ నేతృత్వంలో మహిళా జట్టు సైతం సెమీ ఫైనల్ వరకూ చేరుకుని ఒక్క అడుగు దూరంలో పతకాన్ని చేజార్చుకుంది.

కామెన్వెల్త్ గేమ్స్ 2022 జులైలో జరుగుతుండగా.. ఆ వెనువెంటనే ఆగష్టులో ఆసియా గేమ్స్ నిర్వహించనున్నారు. ‘2024 పారిస్ ఒలింపిక్ గేమ్స్ కు ఆసియా గేమ్స్ క్వాలిఫికేషన్ ఈవెంట్ లాంటిది. దానిని దృష్టిలో ఉంచుకునే హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అసలే కొవిడ్-19 వ్యాప్తి ఉన్న సమయంలో కామన్వెల్త్ లో పాల్గొని రిస్క్ చేయదలచుకోవడం లేదని’ హాకీ ఇండియా ప్రెసిడెంట్ అన్నారు.

……………………………………………………… : యువతలో గుండెజబ్బులు… అసలు కారణం ఏంటంటే?..

వచ్చే నెల భువనేశ్వర్ వేదికగా జరిగే ఎఫ్ఐహెచ్ మెన్స్ జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఇంగ్లాండ్ జట్టు వెనుకడుగేసింది. ఆ మరుసటి రోజే హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ భయంతోనే ఆ దేశం ఇలా ప్లాన్ చేసింది. ఇండియా ప్రభుత్వం లెక్కల ప్రకారం.. కచ్చితంగా 10రోజుల క్వారంటైన్ ప్రొటోకాల్స్ పాటించాలని యూకే నేషనల్స్ కు చెప్పింది.