India Medals : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ అదరగొడుతోంది. బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. రెండో రోజు మొత్తం 4 పతకాలను ఖాతాలో వేసుకోగా...అవన్నీ వెయిట్ లిఫ్టర్లకే దక్కాయి. క్రీడల్లో తొలి స్వర్ణం దక్కింది.

India Medals : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

India

India medals : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ అదరగొడుతోంది. బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. రెండో రోజు మొత్తం 4 పతకాలను ఖాతాలో వేసుకోగా…అవన్నీ వెయిట్ లిఫ్టర్లకే దక్కాయి. క్రీడల్లో తొలి స్వర్ణం దక్కింది.

వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్‌మెడల్ సాధించారు. 49 కేజీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో పసిడి పట్టేసింది. వరుసగా 88, 113 కేజీలు లిఫ్ట్ చేసిన మీరాబాయి..గోల్డ్ చేజిక్కించుకుంది. మూడో ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తడంలో విఫలమైంది. అయినప్పటికీ రేసులో అగ్రస్థానంలో నిలిచింది.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజతం

మొత్తంగా 201 కేజీలతో పసిడిని పట్టేసింది. మొత్తంగా మీరాబాయి చానుకు ఇది మూడో కామన్వెల్త్‌ స్వర్ణం. గత రెండు సీజన్లు మాదిరిగానే ఈ సారి స్వర్ణాన్ని కైవసం చేసుకుని అరుదైన ఘనత సాధించింది. మీరాబాయి చాను గత రెండు కామన్వెల్త్ ఎడిషన్లలోనూ గోల్డ్ సాధించింది. 2014, 2018లో మాదిరిగా తన పోరాట పటిమను మరోసారి నిరూపించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

ఇక వింద్యారాణి 55 కేజీల విభాగంలో రజత పతకం సాధించారు. మరోవైపు పురుషుల విభాగంలోనూ భారత్ సత్తా చాటింది. 55కేజీల విభాగంలో సంకేత్…రజత పతకం సాధించారు. మరో వెయిట్ లిఫ్టర్ గురురాజపూజారా కాంస్యం సొంతం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

Mirabai Chanu : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చానుకి గోల్డ్ మెడల్

శనివారం 55 కేజీల విభాగంలో సంకేత్ రజత పతకంతో పతకాల వేటలో భారత్ ఖాతాను ఓపెన్ చేయగా.. 61 కేజీల కేటగిరిలో గురురాజ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. 61 కేజీల కేటగిరిలో మొత్తం 269(118కిలోలు + 151కిలోలు)తో ముగించి మూడో స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జెర్క్ లో 151 కేజీలు, స్నాట్చ్ లో 118 కేజీలు ఎత్తాడు. కెనడా వెయిట్ లిఫ్టర్ యూరి సిమర్ధ్ నుంచి గురురాజకు తీవ్ర పోటీ ఎదురైంది.

భారత్‌కు రెండో పతకాన్ని అందించిన గురురాజాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని, నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ.. “పి. గురురాజా కాంస్య పతకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది! అతనికి అభినందనలు. అతను గొప్ప సంకల్పాన్ని ప్రదర్శించాడు. అతని క్రీడా ప్రయాణంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.