K9 Vajra : డ్రాగన్‌పై వజ్రాయుధం, శత్రుమూకలు, ప్రత్యర్థులకు దబిడి దిబిడే

డ్రాగన్‌పై వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టింది భారత సైన్యం. K9 - వ‌జ్రా హోవిట్జర్ గన్స్‌ను గురిపెట్టింది. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో సైనిక స‌దుపాయాల‌ను పెంచుతున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు.

K9 Vajra : డ్రాగన్‌పై వజ్రాయుధం, శత్రుమూకలు, ప్రత్యర్థులకు దబిడి దిబిడే

Indian Army

K9 Vajra In Ladakh : తూర్పు లద్దాఖ్‌ లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్‌ ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతోంది. తాజాగా డ్రాగన్‌పై వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టింది భారత సైన్యం. భారీ సంఖ్యలో K9 – వ‌జ్రా హోవిట్జర్ గన్స్‌ను గురిపెట్టింది. నియంత్రణ రేఖ దగ్గర భారత్‌ కొత్త ఆయుధాన్ని మోహ‌రించింది. చైనా స‌రిహ‌ద్దులో ఉన్న ఎల్‌ఏసీ దగ్గర తొలిసారి కే9- వ‌జ్రా హోవిట్జర్ గ‌న్నుల‌ను ఇండియ‌న్ ఆర్మీ ఎక్కుపెట్టింది.చైనా కుట్రలను తిప్పికొట్టేందుకు భారత్ రెడీ అయింది. చైనా ట్యాంకర్లకు దీటుగా భారత్‌ తన ట్యాంకర్లను రంగంలోకి దింపింది. భారత్-చైనా సరిహద్దుల్లో డ్రాగన్‌ తన హోవిట్జర్‌లు, ట్యాంకులు, సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్‌ను ప్రవేశపెట్టగా.. భారత్‌ తన అములపొదిలో నుంచి శక్తివంతమైన ఆయుధాన్ని బయటకు తీసింది.

Read More : Bollywood : ముంబైలో సెలబ్రెటీ రేవ్ పార్టీ భగ్నం, ఎన్సీబీ అదుపులో బాలీవుడ్ నటుడు ?

అదే కే9-వజ్రా. కే9 వజ్రా రంగంలోకి దిగితే… శత్రుమూకలు, ప్రత్యర్థులు గజగజ వణికిపోవాల్సిందే. కే9 ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 కిలోమీటర్ల దూరంలో శత్రు టార్గెట్లను ధ్వంసం చేసే కెపాసిటి. కే9ని ఎక్కుపెడితే…. శత్రువుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కే9 వజ్రా హై అల్టిట్యూడ్ ఏరియాల్లోనూ పనిచేస్తాయి. ఇటివలే చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడంతో దానికి సమాధానంగా కే9-వజ్రా రెజిమెంట్‌ను సీన్‌లోకి దింపింది ఆర్మీ. కే9- వజ్రాతో పాటుగా హోవిట్జర్లను సరిహద్దుల్లో భారీగా మోహరించింది. ఫీల్డ్ ట్రయ‌ల్స్ స‌మ‌యంలో హోవిట్జర్లు చాలా స‌క్సెస్ రేటును చూపడంతో వీటితో విన్యాసాలు చేయిస్తోంది ఆర్మీ. అటు చైనా ద‌ళాల క‌దిలిక‌ల‌ను గ‌మ‌నిస్తూనే ఉన్నామ‌న్నారు ఆర్మీ చీఫ్‌ నరవాణే. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. చైనా త‌న ఫార్వర్డ్ ప్రాంతాల్లో ద‌ళాల‌ను పెంచిందని.. ఇది చాలా ఆందోళనకరమైన విషయమన్నారు.

Read More : Bhabanipur Bypoll : తేలనున్న మమత భవితవ్యం, భవానీపూర్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

అయితే ఎలాంటి ముప్పునైన తిప్పి కొట్టేందుకు రెడీగా ఉన్నామన్నారు. స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో సైనిక స‌దుపాయాల‌ను పెంచుతున్నట్లు తెలిపారు. గ‌త ఆరు నెల‌ల నుంచి ల‌ద్దాఖ్‌లో ప‌రిస్థితి ప్రశాంతంగా ఉందని.. అక్టోబ‌ర్ రెండో వారంలో చైనా సైనిక ద‌ళాల‌తో 13వ రౌండ్ చ‌ర్చలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నట్లు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఆ చ‌ర్చల్లో ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ‌పై ఏకాభిప్రాయం కుదిరే అవ‌కాశాలు ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని స‌మ‌స్యాత్మక ప్రాంతాల‌ను క్లియ‌ర్ చేయ‌నున్నట్లు స్పష్టం చేశారు. తూర్పు లడాఖ్‌లో భారత్, చైనాల మధ్య గతేడాది మే నుంచి సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల్లో భారీగా సైనిక నిర్మాణాలను మాత్రం చైనా ఆపడంలేదు. భారత్ ఎదుర్కొంటున్న సైనిక, వైమానిక స్థావరాల అప్‌గ్రేడ్‌లో భాగంగా సరిహద్దుల్లో మరిన్ని సైనిక ఆశ్రయాలను నిర్మిస్తూనే ఉంది.