T20 World Cup 2021: ఐసీయూ నుంచి వచ్చి మ్యాచ్ ఆడిన పాక్ ప్లేయర్ రిజ్వాన్.. ఇండియన్ డాక్టర్ ట్రీట్మెంట్

ప్రస్తుత టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబరిచిన పాక్ ప్లేయర్లు మంచి పట్టుదలతో... సెమీ ఫైనల్ మ్యాచ్ కు కొద్ది రోజుల ముందే ఐసీయూలో 2రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని బరిలోకి దిగాడట.

T20 World Cup 2021: ఐసీయూ నుంచి వచ్చి మ్యాచ్ ఆడిన పాక్ ప్లేయర్ రిజ్వాన్.. ఇండియన్ డాక్టర్ ట్రీట్మెంట్

Pakistan Cricketer

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా సూపర్ 12 స్టేజి నుంచే బయటికొచ్చేసింది. తొలి మ్యాచ్ లో ఇండియాను ఢీ కొట్టిన పాకిస్తాన్ సెమీ ఫైనల్ తో పోరాటాన్ని ముగించింది. ప్రస్తుత టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబరిచిన పాక్ ప్లేయర్లు మంచి పట్టుదలతోనే బరిలోకి దిగారు. ఎంతలా అంటే సెమీ ఫైనల్ మ్యాచ్ కు కొద్ది రోజుల ముందే ఐసీయూలో 2రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని బరిలోకి దిగాడట.

వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ను స్వదేశం సహా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అభినందనలతో ముంచెత్తింది. రిజ్వాన్‌కు చికిత్స అందించిన డాక్టర్స్ టీంలో ఇండియన్ డాక్టర్ ఉండటం విశేషం. రిజ్వాన్‌ ఆరోగ్య పరిస్థితి, ఫిట్‌నెస్‌ సాధించడంపై శనివారం వివరాలను వెల్లడించారు. సెమీఫైనల్‌ మ్యాచ్‌ కోసం రిజ్వాన్‌ వేగంగా రికవరీ అవడం ఆశ్చర్యానికి గురి చేసిందని డాక్టర్‌ సహీర్‌ సైనాలబ్దీన్‌ పేర్కొన్నారు.

మహమ్మద్‌ రిజ్వాన్‌ ఆసుపత్రిలో చేరడానికి మూడు రోజుల ముందు స్వల్ప జ్వరం, దగ్గు, ఛాతిలో బిగించి ఉన్నట్లుగా ఉండే లక్షణాలతో బాధపడ్డాడు. వెంటనే వైద్యబృందం ఛాతిలోని నొప్పిని తగ్గించేందుకు ఎంతో శ్రమించింది. ఆసుపత్రిలో రిజ్వాన్‌ ఉన్న సమయంలోనూ మ్యాచ్‌ ఆడేందుకు రిజ్వాన్‌ ఎంతో నమ్మకంగా ఉండేవాడని సహీర్‌ తెలిపారు.

………………………………….. : వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దొందూ దొందే : తులసిరెడ్డి

‘మ్యాచ్‌ను ఆడాల్సిందే. జట్టుతో ఉండాలని అనేవాడు. కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌లో దేశం తరఫున ఆడాలని బలంగా కోరుకునేవాడు. దృఢంగా, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అయితే అతడు కోలుకున్న స్పీడ్‌ను చూసి నేనైతే చాలా ఆశ్చర్యపోయా’ అని డాక్టర్‌ సహీన్‌ చెప్పుకొచ్చారు.

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతినొప్పి వచ్చే అవకాశం ఉందని.. కొన్ని నిమిషాల నుంచి గంటలపాటు నొప్పి ఉంటుందని వైద్యుడు సహీన్‌ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వేరెవరైనా కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించడానికి 5 నుంచి 7 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు.

దాదాపు 35 గంటలపాటు ఐసీయూలో ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం తీవ్రంగా కృషి చేసిన వైద్య సిబ్బందికి రిజ్వాన్‌ సంతకంతో కూడిన జెర్సీని బహుకరించాడు.