Indian Railways: ఇండియన్ రైల్వేస్‌లో వృద్ధుల టిక్కెట్లపై రాయితీ కట్

ఇండియన్ రైల్వేస్ ట్రావెల్ టికెట్ కన్సెషన్ లో భాగంగా సీనియర్ సిటిజన్ల టిక్కెట్లపై రాయితీని తీసేయనుంది. ఇందులో భాగంగానే కేవలం దివ్యాంగులకు, విద్యార్థులకు మాత్రమే ప్రయాణ రాయితీలు....

Indian Railways: ఇండియన్ రైల్వేస్‌లో వృద్ధుల టిక్కెట్లపై రాయితీ కట్

Indian Railways

Indian Railways: ఇండియన్ రైల్వేస్ ట్రావెల్ టికెట్ కన్సెషన్ లో భాగంగా సీనియర్ సిటిజన్ల టిక్కెట్లపై రాయితీని తీసేయనుంది. ఇందులో భాగంగానే కేవలం దివ్యాంగులకు, విద్యార్థులకు మాత్రమే ప్రయాణ రాయితీలు వర్తించనున్నాయి. మాతృభూమి అనే మీడియా కథనం ప్రకారం.. రైల్వే మంత్రిత్వ శాఖ 53 రకాలైన ట్రావెల్ టికెట్ రాయితీల్లో 38 అంశాలను తొలగించింది.

దీనిని బట్టి ప్రస్తుతం 15రకాలైన రాయితీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దివ్యాంగులతో పాటు ఉన్న 11రకాల్లో పేషెంట్లు, స్టూడెంట్లు ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు, నాన్ ఇన్ఫెక్షియస్ లెప్రొసీ పేషెంట్లకు 50 నుంచి 100శాతం రాయితీ ఇవ్వనున్నారు. స్లీపర్ క్లాస్, ఏసీ క్లాసుల్లోనూ వీరికి రాయితీ ఇస్తున్నారు.

కొవిడ్ మహమ్మారి తర్వాత గత మార్చి నుంచి కొన్ని రాయితీలను తీసేశారు. లాక్ డౌన్ తర్వాత స్పెషల్ ట్రైన్లు నిర్వహించగా.. మరోసారి వృద్ధుల టిక్కెట్లపై రాయితీల్లాంటి వాటిని పునరుద్ధరించలేదు. దీనిపై మంత్రిత్వ శాఖ సుముఖత చూపించకపోవడమే ఇందుకు కారణం.

…………………………………….. : భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్

కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ సమాచారాన్ని బయటకు చెప్పారు.