Vande Bharat Metro : త్వరలోనే..గ్రామాల నుంచి నగరాలకు ‘వందే మెట్రో’ రైళ్లు.. ప్రకటించిన రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్

వందే భారత్ రైళ్లను చూశాం. నగరాల్లో మెట్రో రైళ్లను చూశాం. ఇక త్వరలో ‘వందే మెట్రో’ (Vande Bharat Express trains) రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటన చేశారు.

Vande Bharat Metro : త్వరలోనే..గ్రామాల నుంచి నగరాలకు ‘వందే మెట్రో’ రైళ్లు.. ప్రకటించిన రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్

Vande Bharat Express trains coming soon

Vande Bharat Metro Trains : వందే భారత్ రైళ్లను చూశాం. నగరాల్లో మెట్రో రైళ్లను చూశాం. కానీ నగరాలకు సమీపంలో ఉండే ప్రజల కోసం భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అదే ఊళ్ల నుంచి నగరాలకు వివిధ పనుల గురించి..ఉపాధి గురించి వచ్చేవారి కోసం ‘వందే మెట్రో’ (Vande Bharat Express trains) రైలు సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటన చేశారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తరహాలో వందే మెట్రోలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని రైల్వే మంత్రి తెలిపారు. బుధవారం (ఫిబ్రవరి1.2023) పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు.

పెద్ద నగరాలకు సమీపంలో ఉండే గ్రామాల నుంచి నగరాలకు ప్రయాణించటానికి సౌకర్యవంతంగా రాకపోకలు జరగటానికి వీలుగా ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు’ (Vande Bharat Express) మినీ వెర్షన్ ‘వందే మెట్రో (Vande Metro)’ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. ఉద్యోగులు, వ్యాపారులు,కార్మికులు, విద్యార్థులకు ఈ వందే మెట్రో రైళ్లు ఉపయోగపడతాయని అన్నారు. వందే భారత్‌ తరహాలోనే ‘వందే మెట్రో’లను కూడా అభివృద్ధి చేస్తున్నామని..పెద్ద నగరాల చుట్టుపక్కల 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు వివిధ రకాల పనుల కోసం నగరానికి వచ్చి తిరిగి వెళ్లటానికి వీలుగాను..సౌకర్యవంతంగాను మళ్లీ తమ స్వస్థలాలకు సత్వరం చేరుకునేలా చేయడానికి వందేభారత్‌ మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి సంకల్పించారు. వందే మెట్రో (Vande Metro)ల రూపకల్పన, తయారీ ఈ ఏడాదే పూర్తవుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అలాగే 2023 డిసెంబర్ నాటికల్లా భారతదేశంలో తయారైన మొదటి ‘హైడ్రోజన్ రైలు’అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

కాగా..2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్ రైల్వేలకు రూ.2.42లక్షల కోట్లు కేటాయించినట్లుగా ప్రకటించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.లక్ష కోట్లు ఎక్కువ. దీంతో భారత్ రైల్వే ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే ‘వందే మెట్రో’ రైళ్ల నిర్ణయం తీసుకుంది.