Indian Roads: డిసెంబర్ 2024 నాటికి భారత్ లో రోడ్లు అమెరికాతో సమానంగా ఉంటాయి: నితిన్ గడ్కరీ

భారత దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జాతీయ రహదారులను మరింత విస్తృతంగా నాణ్యతతో అభివృద్ధి చేస్తామని జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ

Indian Roads: డిసెంబర్ 2024 నాటికి భారత్ లో రోడ్లు అమెరికాతో సమానంగా ఉంటాయి: నితిన్ గడ్కరీ

Gadkari

Indian Roads: భారత దేశాన్ని సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జాతీయ రహదారులను మరింత విస్తృతంగా నాణ్యతతో అభివృద్ధి చేస్తామని జాతీయ రోడ్డురవాణా మరియు రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గడ్కరీ సమాధానమిచ్చారు. డిసెంబర్ 2024 నాటికి భారత్ లోని రహదారులు అమెరికా ప్రమాణాలకు సరితూగేలా నాణ్యతతో నిర్మిస్తామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. “సంపన్న దేశమైందున అమెరికాలో రహదారులు బాగుపడలేదని, రహదారులు అభివృద్ధి చేయడంతోనే అమెరికా సుసంపన్న దేశంగా అవతరించిందని” ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

Also Read:Terror Finance: తీవ్రవాదులకు ఆర్ధిక సహాయం చేస్తున్న ఘటనల్లో దేశ వ్యాప్తంగా 103 కేసులు: కేంద్రం వెల్లడి

భారత్ కూడా సుసంపన్న దేశంగా ఎదగాలంటే దేశంలోని రహదారుల మధ్య అనుసంధానం పెరగాలని, అందుకోసం నాణ్యమైన రహదారులను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని గడ్కరీ వివరించారు. డిసెంబర్ 20224 నాటికి ఆదిశగా దేశంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేసమయంలో దేశంలో జాతీయ రహదారులపై ప్రతి ఏడాది జరుగుతున్న రహదారి ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారిపై ఎక్కడైనా ఎపుడైనా ప్రమాదం సంభవిస్తే..తక్షణమే ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా గుర్తించి..ఇకపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోబడతాయని నితిన్ గడ్కరీ వివరించారు.

Also read:Prisoners Cellphone: జైల్లో సెల్ ఫోన్ వాడుతూ పట్టుబడే ఖైదీలకు శిక్ష పెంచనున్న కర్ణాటక రాష్ట్రం

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలలో మరణించే వారికంటే..భారత్ లో ఏటా రహదారి ప్రమాదాల్లో మృతి చెందేవారు సంఖ్య అధికంగా ఉంటుందని నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేసిన గడ్కరీ.. ప్రమాదాల నివారణపై వాహనదారులు, రోడ్డు భద్రత అధికారులతో పాటు స్థానిక ప్రజల్లోనూ లోతైన అవగాహన కల్పించాల్సిన భాద్యత ఉందని అన్నారు. దేశంలో ప్రాంతీయ రోడ్లను విస్తరిస్తూ.. జాతీయ రహదారులకు అనుసంధానించే దిశగా.. కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అయితే ఇక్కడ రహదారి మౌలిక సదుపాయాలను విస్తరించడం సమస్య కాకపోయినా, రోడ్డు ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ప్రజల్లో అవగాహన, విద్య వంటి ఇతర అంశాలు కూడా రహదారి విస్తరణపై ముడిపడి ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

Also read:Surajkund Crafts Mela: రెండేళ్ల అనంతరం ప్రారంభమైన “సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా”