Monkeypox: భార‌త్‌లో తొలి మంకీపాక్స్ బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు: కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి

అత‌డికి తిరువ‌నంత‌పురంలోని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ఆసుప‌త్రిలో చికిత్స అందించామ‌ని వీణా జార్జ్ ఇవాళ తెలిపారు. బాధితుడు కొల్లం ప్రాంతానికి చెందిన వాడ‌ని, అత‌డిని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తార‌ని వివ‌రించారు. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి సూచ‌న‌ల ప్ర‌కారం అత‌డికి 72 గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు సార్లు ప‌రీక్ష‌లు చేశామ‌ని అన్నారు. రెండు ప‌రీక్ష‌ల్లోనూ మంకీపాక్స్ నెగెటివ్‌గా తేలింద‌ని అన్నారు. శ‌రీరంపై ద‌ద్దుర్లు కూడా పూర్తిగా త‌గ్గాయ‌ని అన్నారు.

Monkeypox: భార‌త్‌లో తొలి మంకీపాక్స్ బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు: కేర‌ళ ఆరోగ్య శాఖ మంత్రి

Monkeypox

Monkeypox: భార‌త్‌లో నమోదైన తొలి మంకీపాక్స్ కేసు బాధితుడు (35) పూర్తిగా కోలుకున్నాడని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ ఇవాళ‌ ప్ర‌క‌టించారు. కొన్ని రోజుల క్రితం యూఏఈ నుంచి కేరళకు వ‌చ్చిన ఓ వ్య‌క్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని వీణా జార్జ్​ ఇటీవ‌ల తెలిపిన విష‌యం తెలిసిందే. అత‌డు ఈ నెల 12న తిరువ‌నంత‌పురం విమానాశ్ర‌యంలో దిగాక‌, అత‌డిలో మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌డంతో ఆసుప‌త్రిలో చేర్పించారు. శాంపిళ్ళ‌ను నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపించ‌గా పాజిటివ్‌గా తేలింది.

అత‌డికి తిరువ‌నంత‌పురంలోని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల ఆసుప‌త్రిలో చికిత్స అందించామ‌ని వీణా జార్జ్ ఇవాళ తెలిపారు. బాధితుడు కొల్లం ప్రాంతానికి చెందిన వాడ‌ని, అత‌డిని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తార‌ని వివ‌రించారు. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి సూచ‌న‌ల ప్ర‌కారం అత‌డికి 72 గంట‌ల వ్య‌వ‌ధిలో రెండు సార్లు ప‌రీక్ష‌లు చేశామ‌ని అన్నారు. రెండు ప‌రీక్ష‌ల్లోనూ మంకీపాక్స్ నెగెటివ్‌గా తేలింద‌ని అన్నారు. బాధితుడు మాన‌సికంగా, శారీర‌కంగా ఆరోగ్యంగా ఉన్నాడ‌ని వివ‌రించారు. శ‌రీరంపై ద‌ద్దుర్లు కూడా పూర్తిగా త‌గ్గాయ‌ని అన్నారు. అత‌డి కుటుంబ స‌భ్యుల శాంపిళ్ళ‌ను కూడా తీసుకుని ప‌రీక్షించ‌గా వారికి మంకీపాక్స్ సోక‌లేద‌ని తేలింద‌ని చెప్పారు.

కేర‌ళ‌లో మంకీపాక్స్ సోకిన మ‌రో ఇద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఆమె వివ‌రించారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని అన్నారు. మంకీపాక్స్ వ్యాప్తి గురించి ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. వ్యాప్తి చెంద‌కుండా అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నామ‌ని అన్నారు. కాగా, మంకీపాక్స్ విస్త‌రించ‌కుండా ముంద‌స్తు చర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేఖ‌లు రాసింది.

Kerala: యూట్యూబ్‌లో చూసి మ‌ద్యం త‌యారు చేసిన బాలుడు.. తాగి ఆసుప‌త్రిలో చేరిన అత‌డి స్నేహితుడు