Transgenders Clinics : ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక ఆస్పత్రులు..దేశంలోనే మొదటిసారి

దేశంలోనే మొదటిసారి హైదరాబాద్ లో ట్రాన్స్ జెండర్ల కోసం క్లినిక్స్ ప్రారంభమయ్యాయి.

Transgenders Clinics : ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక ఆస్పత్రులు..దేశంలోనే మొదటిసారి

First Transgender Clinic In Hyderabad

Trans genders clinics in Hyderabad : ట్రాన్స్ జెండర్లు. సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నవీరు విద్య, ఉద్యోగాల్లో కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఆఖరికి అనారోగ్యంపాలై ఆసుపత్రులకు వెళితే అక్కడ కూడా వివక్ష ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే వీరి పట్ల మార్పు వస్తోంది. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పెన్షన్లు ఇవ్వటం..ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించటం చేస్తున్నాయి. వారిలో కూడా మార్పు వస్తోంది.చదువుకుంటున్నారు.ఉద్యోగాల్లోరాణిస్తున్నారు. డాక్టర్లుగా.. పోలీసులకు రాణిస్తున్నారు.

ఈ క్రమంలో వారి కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులను కూడా నెలకొల్పే దిశగా అడుగులు పడతున్నాయి. దీంట్లో భాగంగానే దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్‌జెండ‌ర్ల‌తో నడిచే రెండు క్లినిక్‌ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. లింగమార్పిడి చేయించుకున్న వారి సంక్షేమం కోసం ట్రాన్స్‌జెండ‌ర్ల సంక్షేమ చట్టం-2019ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో హైద‌రాబాద్‌లో మొదటిసారి ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా పనిచేసే హాస్పిటళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ట్రాన్స్‌జెండ‌ర్ క్లినిక్‌లు హార్మోన్ థెరపీ, లింగ ధ్రువీకరణ, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్‌ వంటి ఆరోగ్య సేవలను అందిస్తాయి. ఈ చట్టం ప్రకారం ప్రతి మెట్రో సిటీలో రెండు ట్రాన్స్‌జెండ‌ర్ క్లినిక్‌లు ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.

తెలంగాణ ప్రభుత్వం మొదటగా చొరవ చూపించింది. హైద‌రాబాద్‌ నగరంలో రెండు ప్రాంతాల్లో వీరి కోసం ఆసుపత్రులు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా ఆసపత్రిని ప్రారంభించింది కూడా. 2021లో రెండు క్లినిక్‌లను ప్రారంభించగా.. మొదటిది నారాయణగూడలో జనవరి 29న ప్రారంభించారు. రెండో హాస్పిటల్ జూలై 11న జీడిమెట్లలో ప్రారంభించారు. ఈ క్లినిక్‌లలో ట్రాన్స్‌జెండర్ డాక్టర్లు, కౌన్సిలర్లు, సైకాలజిస్టులతో పాటు ఇతర సిబ్బంది అంతా ట్రాన్స్‌జెండర్లే కావటం గమనించాల్సిన విషయం. అలాని ఈ ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ లో కేవలం ఆ వర్గానికి చెందినవారికి మాత్రమే చికిత్స చేస్తారనుకుంటే పొరపాటే. అన్ని వర్గాల ప్రజలకు అందిస్తారు. హిజ్రా, ట్రాన్స్ మెన్, క్రాస్ డ్రెస్స‌ర్స్, లింగ నిర్ధార‌ణ కాని వారికి, జోగినీలు, శివ‌శ‌క్తుల‌కు కూడా ట్రీట్ మెంట్ ఉంటుంది.