Infinix Zero 5G First Sale : ఇన్ఫినిక్స్ జీరో 5G ఫస్ట్ సేల్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

స్మార్ట్ ఫోన్ మేకర్ Infinix బ్రాండ్ నుంచి 5G భారత మార్కెట్లోకి వచ్చింది. అదే... Infinix Zero 5G స్మార్ట్ ఫోన్.. ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచే మొదలు కానుంది.

Infinix Zero 5G First Sale : ఇన్ఫినిక్స్ జీరో 5G ఫస్ట్ సేల్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Infinix Zero 5g First Sale In India Today Price, Specifications And Everything You Need To Know (2)

Infinix Zero 5G first sale in India : ప్రముఖ హాంగ్ కాంగ్ బేసిడ్ స్మార్ట్ ఫోన్ మేకర్ Infinix బ్రాండ్ నుంచి 5G భారత మార్కెట్లోకి వచ్చింది. అదే… Infinix Zero 5G స్మార్ట్ ఫోన్.. ఈ స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచే మొదలు కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 13 5G బ్యాండ్‌లకు సపోర్టు చేస్తుంది. అలాగే మీడియాటెక్ డెన్సిటీ 900 ప్రాసెసర్ కలిగి ఉంది. 48-MP ప్రైమరీ కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీ సహా అనేక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ సందర్భంగా కొత్త యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart Smart Upgrade ప్లాన్ కింద కొనుగోలుదారులు రూ.99 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యూజర్లు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తే.. ప్లాన్ చేస్తే, MOP విలువలో 70 శాతం అడ్వాన్స్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 30 శాతాన్ని ఒక ఏడాది చివరిలో చెల్లించి Infinix Zero 5G స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కావాలంటే కొనసాగించవచ్చు లేదంటే.. ఫ్లిప్‌కార్ట్‌కి రిటర్న్ చేయొచ్చు. అయితే మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు.. Infinix Zero 5G ధర, స్పెసిఫికేషన్‌లు ఏమేమి ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోండి..

Infinix Zero 5G ధర ఎంతంటే? :
Infinix Zero 5G సింగిల్ 8GB వేరియంట్ ప్రారంభ ధర రూ.19,999 స్మార్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్‌తో వస్తోంది. ఈ ఫోన్ కొనుగోలుపై కొనుగోలుదారులు ధరలో 70 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఫోన్ కోసం మీరు రూ.14,098 వరకు చెల్లించవచ్చు. ఒక ఏడాది తర్వాత.. మిగిలిన 30 శాతాన్ని చెల్లించవచ్చు లేదా ఫోన్‌ను తిరిగి ఇవ్వవచ్చు. ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ మొదలు కానుంది. ఈ ఫోన్ మొత్తం మూడు కలర్ వేరియంట్లలో వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ (vegan leather back panel), కాస్మిక్ బ్లాక్‌‌ (cosmic black), స్కైలైట్ ఆరెంజ్‌ (skylight orange)తో అందుబాటులో ఉంటుంది.

Infinix Zero 5g First Sale In India Today Price, Specifications And Everything You Need To Know (1)

Infinix Zero 5G: Specifications :
Infinix Zero 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల FHD+LTPS IPS డిస్‌ప్లే హైరిఫ్రెష్ రేట్ 120Hz, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. డిస్‌ప్లే 500 NITS పీక్ బ్రైయిట్ నెస్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek డెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పాటు 8GB RAM, 128GB స్టోరేజ్‌తో రన్ అవుతుంది. లేటెస్ట్ LPDDR5 RAM టెక్నాలజీఅల్ట్రా-ఫాస్ట్ (UFS) 3.1 స్టోరేజీ సపోర్టు ఇవ్వనుంది. ఫస్ట్ Infinix స్మార్ట్‌ఫోన్, లార్జ్ ఫైల్‌లను కూడా స్టోర్ చేసేందుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. Infinix Zero 5G ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

కెమెరాల విషయానికోస్తే. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ (Triple Camera Setup)ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్ 13MP పోర్ట్రెయిట్ లెన్స్, 2MP డెప్త్ లెన్స్, క్వాడ్-LED ఫ్లాష్‌లైట్లు ఉన్నాయి. కెమెరా సెక్షన్‌లో 13-MP పోర్ట్రెయిట్ లెన్స్ 2x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఫోన్‌లో సెల్ఫీల కోసం 16-MP కెమెరా ఉంది. Infinix Zero 5G 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh హై-కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. TUV రైన్‌ల్యాండ్ ధృవీకరించిన తక్కువ-కరెంట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో యూజర్లను మరింత ఆకట్టుకునేలా ఉంది.

Read Also : Vivo New Smartphone: వివో నుంచి T1 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి?