TRS : మహిళాబంధు సంబురాలు షురూ.. మూడు రోజులు సెలబ్రేషన్స్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మ‌హిళా బంధు సంబురాలకు శ్రీకారం చుట్టింది గులాబీ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల‌పాటు.. సెల‌బ్రేష‌న్స్‌కు పిలుపునిచ్చింది...

TRS : మహిళాబంధు సంబురాలు షురూ.. మూడు రోజులు సెలబ్రేషన్స్

Trs

International Women’s Day 2022 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మ‌హిళా బంధు సంబురాలకు శ్రీకారం చుట్టింది గులాబీ పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల‌పాటు.. సెల‌బ్రేష‌న్స్‌కు పిలుపునిచ్చింది. 2022, మార్చి 06వ తేదీ ఆదివారం నుంచి మంగళవారం  వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల కోసం టీఆర్‌ఎస్‌ శ్రేణులు సన్నద్ధం అయ్యాయి. మహిళల కోసం నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతమంది లబ్ధిదారులున్నారో లెక్కలు తీసి వాటి ఆధారంగా మూడు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

Read More : Telangana : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మూడు రోజులు సంబరాలు

ఇందులో భాగంగా.. తొలిరోజు కేసీఆర్‌ ఫ్లెక్సీల‌కు రాఖీలు క‌ట్టడం.. పారిశుధ్య కార్మికులు, ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఆశావర్కర్లు ఆయా రంగాల్లో సేవ‌లు చేసిన మ‌హిళ‌ల‌కు స‌న్మానాలు చేయ‌నున్నారు. ఇక రెండో రోజు.. షాదీ ముబార‌క్, క‌ల్యాణ‌ ల‌క్ష్మీ, కేసీఆర్ కిట్ ల‌బ్ది దారుల‌తో సెల్పీలు, మానవహారాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక చివరి రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్‌చెరు సుల్తాన్‌పూర్‌లోని ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును ప్రారంభించాలని నిర్ణయించారు. పారిశ్రామిక రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ పార్కును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ఈ నెల 8న ప్రారంభించనున్నారు. ఫిక్కీకి అనుబంధంగా పనిచేస్తున్న ఎఫ్‌ఎల్‌వో కోసం టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కులో మహిళా పారిశ్రామికవేత్తలకు 50 శాతం రాయితీతో స్థలాలు కేటాయించారు.