iPhone 14 : ఐఫోన్ 13 ప్రాసెస‌ర్‌తో ఐఫోన్ 14 వస్తోంది.. ఎప్పుడో తెలుసా?

iPhone 14 Phone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ నుంచి 14 సిరీస్ రాబోతోంది. 2022 ఏడాది చివరిలో iPhone 14 ఫోన్ అధికారికంగా లాంచ్ కానుంది.

iPhone 14 : ఐఫోన్ 13 ప్రాసెస‌ర్‌తో ఐఫోన్ 14 వస్తోంది.. ఎప్పుడో తెలుసా?

Iphone 14 Phone Iphone 14 Likely To Be Powered By The Same Processor As The Iphone 13

iPhone 14 Phone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ నుంచి 14 సిరీస్ రాబోతోంది. 2022 ఏడాది చివరిలో iPhone 14 ఫోన్ అధికారికంగా లాంచ్ కానుంది. అంటే.. సెప్టెంబర్ నెలలోపు ఈ కొత్త ఐఫోన్ 14 రిలీజ్ కానుంది. కానీ, కచ్చితమైన లాంచ్ తేదీని ఆపిల్ ఇంకా వెల్లడించలేదు. సెప్టెంబర్ రెండవ వారంలో ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ముందుగా రాబోయే నాలుగు iPhone 14 మోడల్‌లు A16 బయోనిక్ చిప్‌సెట్ తో వస్తాయని నివేదికలు సూచించాయి.

అయితే, TrendForce నుండి వచ్చిన కొత్త నివేదిక ప్రకారం.. రెండు చౌకైన మోడల్‌లు మొత్తం iPhone 13 సిరీస్‌ రానున్నాయి. అందులో A15 బయోనిక్ చిప్‌తో రానున్నాయి. ఈ మోడల్‌లలో iPhone 14, iPhone 14 Max ఉన్నాయి. ఐఫోన్ ప్రో సిరీస్‌లో లేటెస్ట్ ప్రాసెసర్‌లు మాత్రమే రానున్నాయని నివేదిక పేర్కొంది. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌తో కూడిన ప్రో మోడల్‌లు ఆపిల్ నెక్ట్స్ జనరేషన్ చిప్, A16 బయోనిక్‌లో రన్ అవుతాయని నివేదిక సూచిస్తుంది. కొంచెం అప్‌గ్రేడ్ వెర్సన్‌తో వచ్చే అవకాశం ఉంది. iPhone 13తో పోలిస్తే.. iPhone 14, iPhone 14 Max ఫోన్లు..A15 బయోనిక్ చిప్‌తో RAM, GPU పవర్‌తో రానున్నాయి.

Iphone 14 Phone Iphone 14 Likely To Be Powered By The Same Processor As The Iphone 13 (1)

Iphone 14 Phone Iphone 14 Likely To Be Powered By The Same Processor As The Iphone 13 

ఐఫోన్ 14 లాంచ్ వివరాలివే :
ఆపిల్ రాబోయే ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో 4 కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max. నివేదికల ప్రకారం.. ఆపిల్ మినీ మోడల్‌ మినహా iPhone 14 Maxతో రానుంది. ఐఫోన్ SE మోడల్ సేల్స్‌పై మినీ మోడల్ ప్రభావం చూపుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

అందుకే ఆపిల్ ఆ మోడల్‌ను తొలగించాలని నిర్ణయించుకుంది. అధికారిక లాంచ్‌కు ముందు.. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఐఫోన్ 14, 14 మ్యాక్స్‌లు వైడ్ నాచ్, డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. ఇక ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు ముందు భాగంలో పిల్ ఆకారపు డిజైన్‌ను, వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెన్సార్‌లతో రానున్నాయి.

Read Also : New iPhone Discount : ఆపిల్ కొత్త ఐఫోన్లపై భారీ డిస్కౌంట్.. మే 31వరకు ఛాన్స్.. డోంట్ మిస్..!