IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్‌బై

ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇకపై ఆ ఫ్రాంచైజీకి ఆడటం లేదు. హైదరాబాదీ జట్టుతో తనకున్న ఒప్పందం ముగిసిపోగా.. సోమవారం జరిగిన మ్యాచ్ లోనూ ...

10TV Telugu News

IPL 2021: ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇకపై ఆ ఫ్రాంచైజీకి ఆడటం లేదు. హైదరాబాదీ జట్టుతో తనకున్న ఒప్పందం ముగిసిపోగా.. సోమవారం జరిగిన మ్యాచ్ లోనూ కనిపించలేదు. ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‍‌ను కెప్టెన్ గా ఆరంభించిన డేవిడ్ వార్నర్.. తుది జట్టులో లేకపోవడంతో కనీసం మ్యాచ్ చూడటానికైనా స్టేడియానికి రాలేదు.

హోటల్ గదిలోనే ఉండిపోయాడు. లాజికల్ గా చూస్తే.. అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చేసుకున్న ఒప్పందం ముగిసిపోయినట్లుగా తెలుస్తుంది. తర్వాతి సీజన్ కు వేలం జరగాల్సి ఉండగా.. అన్ని జట్లు ఫ్రెష్ గా జట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. రెండు సీజన్లుగా ఆకట్టుకోలేని ప్రదర్శనతో సరిపెట్టుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈ సారి జట్టులో మార్పుల వల్ల సాధ్యమవుతుందని భావిస్తుంది.

ఈ స్టేట్మెంట్‌ను టీమ్ కోచ్ ట్రెవర్ బేలిస్ కూడా కన్ఫమ్ చేశాడు. ఇక్కడ మాకు చాలా మంది యంగ్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. ఈ మ్యాచ్ కోసం కొద్ది మార్పులు చేసి వస్తున్నాం. గ్రౌండ్ కు రాకుండా హోటల్ లోనే ఉండిపోయిన వారికి కాకుండా వీరికి అవకాశం ఇద్దామనుకుంటున్నాం. ఈ గేమ్ వరకూ డేవిడ్ వార్నర్, కేదర్ జాదవ్, నదీమ్ హోటళ్లోనే ఉండిపోయారు అని మీడియాతో అన్నాడు.

…………………………… : పవన్ కళ్యాణ్ కామెంట్స్‌తో నేను ఏకీభవించట్లేదు..

ఫేజ్ 1లో మనీశ్ పాండేను జట్టులో నుంచి పక్కకు పెట్టిన సమయంలో టీమ్ మేనేజ్మెంట్ కు వార్నర్ కు మధ్య వాదనలు జరిగాయట. ఆ సమయంలో విలియమ్సన్ కెప్టెన్ గా తెరపైకి వచ్చాడు. ఫేజ్ 2లో జాసన్ రాయ్ కెప్టెన్ గా కనిపించాడు. కాకపోతే ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో 0, 2 స్కోర్లు నమోదు చేసి నిరాశపరిచాడు.