IPL 2022: సచిన్, యువరాజ్‌లతో సమానంగా ఇషాన్ కిషన్

ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మరో అద్బుతమైన ఘనత సాధించాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ లతో సమానంగా నిలిచాడు.

IPL 2022: సచిన్, యువరాజ్‌లతో సమానంగా ఇషాన్ కిషన్

Isshan Ipl

IPL 2022: ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ మరో అద్బుతమైన ఘనత సాధించాడు. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ లతో సమానంగా నిలిచాడు. ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో 81పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ల లిస్టులో చేరిపోయాడు.

ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా ప్లేయర్ క్వింటాన్ డి కాక్ ల తర్వాత ఇషాన్ చేరిపోయాడు. దాంతో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఖరీదైన ప్లేయర్లలో యువరాజ్ సింగ్ తర్వాత ఇషాన్ కే మళ్లీ అంతటి ఘనత దక్కింది. 2014వేలంలో యువీ కోసం రూ.15.25కోట్లు కేటాయించింది ముంబై ఫ్రాంచైజీ. వేలం తర్వాత ఆడిన మ్యాచ్ లో యువీ కూడా హాఫ్ సెంచరీ చేశాడు.

ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై వర్సెస్ ఢిల్లీ తలపడగా.. 5 వికెట్ల నష్టానికి ముంబైకు 178 పరుగులు టార్గెట్ నిర్దేశించింది. రోహిత్ శర్మతో పాటుగా ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషన్ (81 నాటౌట్; 48బంతుల్లో) చివరి వరకూ క్రీజులో పాతుకుపోయాడు. కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2వికెట్లు పడగొట్టాడు.

Read Also : ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ 178

ఐపీఎల్-2022 సీజన్-15లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దంచికొట్టింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముంబై ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (81*) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. పరుగుల వరద పారించాడు. కెప్టెన్ రోహిత్‌ శర్మ(41), తిలక్‌ వర్మ (22) కూడా రాణించారు. ఢిల్లీ బౌలరల్లో కుల్‌దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా.. ఖలీల్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశాడు.