IPL 2022 – RR vs GT : టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్.. గుజరాత్‌కు స్టార్ బౌలర్ దూరం..!

IPL 2022 - RR vs GT : ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.

IPL 2022 – RR vs GT : టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్.. గుజరాత్‌కు స్టార్ బౌలర్ దూరం..!

Ipl 2022, Rr Vs Gt Rajasthan Win Toss And Opt To Bowl, Playing 11 Named

IPL 2022 – RR vs GT : ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుని.. ప్రత్యర్థి జట్టు గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ ఏడాదిలో రెండు ఐపీఎల్ జట్లు కొత్తగా చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్లు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్ ల్లో గెలిచి తలో ఒక మ్యాచ్ ఓడిపోయాయి.

ఫలితంగా పాయింట్స్ టేబుల్లో ఆరు పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ గాయంతో దూరమయ్యాడు. అతడి స్థానంలో జేమ్స్ నీషమ్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. గుజరాత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. యష్ దయాల్, విజయ్ శంకర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్క్ండే స్థానంలో జట్టులోకి వచ్చారు.

ఈ సీజన్‌‌లో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతోంది. భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధిస్తోంది. జాస్ బట్లర్ మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రోన్ హెట్మెయిర్ టాప్ క్లాస్ బ్యాటర్లతో రాజస్థాన్ బలంగా కనిపిస్తోంది. ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచుకు దూరమవ్వడం గుజరాత్‌కు తీరని లోటుగా మారింది. యువ ఆటగాడు కుల్దీప్​ సేన్​ కూడా మంచి ఫాంలో ఉన్నాడు. రవిచంద్రన్​ అశ్విన్​, యుజ్వేంద్ర చాహల్​లు స్పిన్ మాయాజాలాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి. ఒకవైపు గుజరాత్ గెలుపు కోసం ఆరాటపడుతుంటే.. మరో విజయం కోసం రాజస్థాన్ ఉవ్విళ్లూరుతోంది.

తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, మాథ్యూవేడ్ , విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తేవటియా, రషీద్ ఖాన్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యష్ దయాల్

రాజస్థాన్ రాయల్స్ : జాస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కేప్టెన్), రస్సీ వాన్ డర్ డస్సెన్, షిమ్రోన్ హెట్మెయిర్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, చాహల్, కుల్దీప్ సేన్

Read Also :  IPL2022 PBKS Vs MI : ఐదుసార్లు ఛాంపియన్ ముంబైకి వరుసగా 5వ ఓటమి.. పంజాబ్ చేతిలో చిత్తు