IPL 2023, DC Vs MI: బోణీ కొట్టిన ముంబై.. ఉత్కంఠ‌పోరులో ఢిల్లీపై గెలుపు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.

IPL 2023, DC Vs MI: బోణీ కొట్టిన ముంబై.. ఉత్కంఠ‌పోరులో ఢిల్లీపై గెలుపు

DC Vs MI

IPL 2023, DC Vs MI:ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 16వ సీజ‌న్‌లో వ‌రుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) ఎట్ట‌కేల‌కు ఓ విజ‌యాన్ని సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌((Delhi Capitals)తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్ధేశించిన 173 ప‌రుగుల ల‌క్ష్యాన్నిస‌రిగ్గా ఆఖ‌రి బంతికి ఛేదించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (65; 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్థ‌శ‌త‌కం బాద‌గా తిల‌క్ వ‌ర్మ (41; 29 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స‌ర్లు), ఇషాన్ కిష‌న్‌(31)ల‌తో పాటు ఆఖ‌ర్లో టిమ్ డేవిడ్‌(13 నాటౌట్‌), కామెరూన్ గ్రీన్‌(17 నాటౌట్‌) రాణించ‌డంతో విజ‌యం సాధించింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ముకేష్ కుమార్ రెండు వికెట్లు తీయ‌గా, ముస్తాఫిజుర్ రెహమాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అంత‌క‌ముందు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ 19.4 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్‌(54; 25 బంతుల్లో 4ఫోర్లు, 5 సిక్స‌ర్లు), డేవిడ్ వార్న‌ర్‌(51; 47 బంతుల్లో 6ఫోర్లు) అర్థ‌శ‌త‌కాల‌తో రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో జేసన్ బెహ్ర‌న్‌డార్ఫ్, పీయూష్ చావ్లా చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, రిలే మెరిడిత్ రెండు, హృతిక్ షోకీన్ ఓ వికెట్ తీశాడు. ఈ విజ‌యంతో ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో ఖాతా తెరిచింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 11 Apr 2023 11:21 PM (IST)

    ఢిల్లీ పై ముంబై విజ‌యం

    ఢిల్లీ నిర్ధేశించిన 173 ప‌రుగుల ల‌క్ష్యాన్నిస‌రిగ్గా ఆఖ‌రి బంతికి ఛేదించింది ముంబై ఇండియ‌న్స్. రోహిత్ శ‌ర్మ ఔట్ అయిన త‌రువాత కాస్త త‌డ‌బ‌డిన ముంబై.. గ్రీన్‌, డేవిడ్‌లు రాణించ‌డంతో విజ‌యం సాధించింది.

  • 11 Apr 2023 11:01 PM (IST)

    రోహిత్ శ‌ర్మ ఔట్‌

    క్రీజులో పాతుకుపోయిన ఓపెన‌ర్, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఔట్ అయ్యాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్‌లో అభిషేక్ పోరెల్ క్యాచ్ అందుకోవ‌డంతో హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 65 ప‌రుగులు చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 147/4. ముంబై గెల‌వాలంటే 18 బంతుల్లో 26 ప‌రుగులు చేయాలి.

  • 11 Apr 2023 10:53 PM (IST)

    వ‌రుసగా రెండు వికెట్ కోల్పోయిన ముంబై

    ర‌న్‌రేట్ పెరిగిపోతుండ‌డంతో తిల‌క్ వ‌ర్మ భారీ షాట్ల‌కు య‌త్నించాడు. ఈ క్ర‌మంలో ముకేష్ కుమార్ వేసిన 16 ఓవ‌ర్‌లో తొలి బంతికి ఫోర్ కొట్ట‌గా, రెండు, మూడు బంతుల‌ను సిక్స‌ర్లుగా మ‌లిచాడు. అదే ఊపులో ఐదో బంతికి భారీ షాట్‌కు య‌త్నించి పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఆ మ‌రుస‌టి బంతికే సూర్య‌కుమార్ యాద‌వ్ గోల్డెన్ డ‌క్‌ అయ్యాడు. 16 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 139/3. రోహిత్ శ‌ర్మ( 61), టిమ్ డేవిడ్‌(0) ఉన్నారు.

  • 11 Apr 2023 10:47 PM (IST)

    పుంజుకున్న ఢిల్లీ బౌల‌ర్లు

    టైమ్ ఔట్ త‌రువాత ఢిల్లీ బౌల‌ర్లు ల‌య అందుకున్నారు. వికెట్లు తీయ‌న‌ప్ప‌టికి ప‌రుగులు క‌ట్ట‌డి చేస్తున్నారు. 14వ ఓవ‌ర్ వేసిన ల‌లిత్ యాద‌వ్ 4 ప‌రుగులు ఇవ్వ‌గా 15వ ఓవ‌ర్ వేసిన ముస్తాఫిజుర్ రెహమాన్ కేవ‌లం రెండు ప‌రుగులే ఇచ్చాడు. 15 ఓవ‌ర్లకు ముంబై స్కోరు 123/1. విజ‌య స‌మీక‌ర‌ణం 30 బంతుల్లో 50గా ఉంది. రోహిత్ శ‌ర్మ 61, తిల‌క్ వ‌ర్మ 25 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 10:27 PM (IST)

    రోహిత్ శ‌ర్మ అర్థ‌శ‌త‌కం

    చాలా రోజుల త‌రువాత ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫామ్‌లోకి వ‌చ్చాడు. కుల్‌దీప్ వేసిన 12వ ఓవ‌ర్ తొలి బంతికి సింగిల్ తీయ‌డంతో రోహిత్ అర్థ‌శ‌త‌కం పూరైంది. కేవ‌లం 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో ఈ ఘ‌న‌త‌ను రోహిత్ సాధించాడు. ఐపీఎల్‌లో 24 ఇన్నింగ్స్‌ల త‌రువాత రోహిత్ అర్థ‌శ‌త‌కం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఈ ఓవ‌ర్‌లో నాలుగో బంతికి తిల‌క్ వ‌ర్మ ఫోర్ కొట్ట‌గా, ఆఖ‌రి బంతికి రోహిత్ సిక్స్ బాద‌డంతో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 112/1. రోహిత్ శ‌ర్మ 50, తిల‌క్‌వ‌ర్మ 20 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 10:19 PM (IST)

    తిల‌క్ వ‌ర్మ సిక్స్‌

    ఇషాన్ కిష‌న్ ఔటైన‌ప్ప‌టికి ముంబై ప‌రుగులు ప్ర‌వాహం ఆగ‌డం లేదు. కుల్ దీప్ వేసిన ప‌దో ఓవ‌ర్ మూడో బంతికి తిల‌క్ వ‌ర్మ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 91/1. రోహిత్ శ‌ర్మ 48, తిల‌క్‌వ‌ర్మ 11 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 10:07 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ముంబై

    ముంబై ఓపెన‌ర్లు జోరుకు బ్రేక్ ప‌డింది. 71 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ ప‌డింది. 26 బంతుల్లో 6ఫోర్ల‌తో 31 ప‌రుగులు చేసిన ఇషాన్ కిష‌న్ 7.3ఓవ‌ర్‌లో ర‌నౌట్ అయ్యాడు. ల‌లిత్ యాద‌వ్ వేసిన ఈ ఓవ‌ర్‌లో 3 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 73/1. రోహిత్ శ‌ర్మ 40, తిల‌క్‌వ‌ర్మ 1 ప‌రుగుతో ఉన్నారు.

  • 11 Apr 2023 09:59 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన ముంబై ఇండియ‌న్స్ చెల‌రేగి ఆడుతోంది. నువ్వు ఫోర్ కొడితే నేను సిక్స్ కొడ‌తా అన్న‌ట్లుగా ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌లు ఆడుతున్నారు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి(6 ఓవ‌ర్ల‌కు) ముంబై స్కోరు 69 ప‌రుగుల‌కు చేరింది. రోహిత్ శ‌ర్మ 37, ఇషాన్ కిష‌న్ 30 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 09:49 PM (IST)

    15 ప‌రుగులు

    అన్రిచ్ నార్జ్ వేసిన మూడో ఓవ‌ర్‌లో 15 ప‌రుగులు వ‌చ్చాయి. ఇషాన్ కిష‌న్ ఓ ఫోర్ కొట్టగా, రోహిత్ శ‌ర్మ ఓ ఫోర్‌, సిక్స్ బాదాడు. దీంతో 3 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 42/0. రోహిత్ శ‌ర్మ 24, ఇషాన్ కిష‌న్ 18 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 09:41 PM (IST)

    ఇషాన్ కిష‌న్ హ్యాట్రిక్ ఫోర్లు

    తొలి ఓవ‌ర్‌లో రోహిత్ శ‌ర్మ కొడితే రెండో ఓవ‌ర్‌లో ఇషాన్ మొద‌లుపెట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 13 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 27/0. రోహిత్ శ‌ర్మ 14, ఇషాన్ కిష‌న్ 13 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 09:38 PM (IST)

    హిట్‌మ్యాన్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌

    173 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై ఇండియ‌న్స్ ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్‌లు మైదానంలోకి అడుగుపెట్టారు. ముకేశ్ కుమార్ వేసిన తొలి ఓవ‌ర్‌లోని మూడో బంతిని ఫోర్‌గా మ‌లిచిన హిట్ మ్యాన్ నాలుగో బంతికి సిక్స్ బాదాడు. ఆఖ‌రి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించారు. హిట్‌మ్యాన్ దెబ్బ‌కు తొలి ఓవ‌ర్‌లో ముంబై 14 ప‌రుగులు చేసింది.

  • 11 Apr 2023 09:17 PM (IST)

    ఢిల్లీ ఆలౌట్‌

    ఢిల్లీ క్యాపిట‌ల్స్ 19.4 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

  • 11 Apr 2023 09:12 PM (IST)

    నాలుగు వికెట్లు

    ఢిల్లీ జ‌ట్టు ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయింది. జేసన్ బెహ్ర‌న్‌డార్ఫ్ వేసిన‌ 19 ఓవ‌ర్‌ తొలి బంతికి అక్ష‌ర్ ప‌టేల్‌(54), మూడో బంతికి వార్న‌ర్‌(54) ఔట్ అయ్యారు. నాలుగో బంతికి కుల్‌దీప్‌(0) ర‌నౌట్ కాగా ఆరో బంతికి అభిషేక్ పోరెల్(0) క్యాచ్ ఔట్ అయ్యాడు. 19 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 166/9.

  • 11 Apr 2023 09:03 PM (IST)

    అక్ష‌ర్ అర్ధ‌శ‌త‌కం

    ఏ బౌల‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ వ‌ద‌ల‌డం లేదు. కేవ‌లం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. అక్ష‌ర్ ధాటికి స్కోరు బోర్డు ప‌రుగులు పెడుతోంది. 18 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 165/5. డేవిడ్ వార్న‌ర్ 51, అక్ష‌ర్‌ప‌టేల్ 54 ప‌రుగుతో ఉన్నారు.

  • 11 Apr 2023 08:56 PM (IST)

    అక్ష‌ర్ దూకుడు

    అక్ష‌ర్ పటేల్ దూకుడు కొన‌సాగిస్తున్నాడు. గ్రీన్ వేసిన 16 ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు కొట్టిన అక్ష‌ర్.. జేసన్ బెహ్ర‌న్‌డార్ఫ్ వేసిన 17వ ఓవ‌ర్‌లో రెండు సిక్స‌ర్లు బాదాడు. అక్ష‌ర్ దంచికొడుతుండ‌డంతో ఢిల్లీ కోలుకుంది. 17 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 151/5. డేవిడ్ వార్న‌ర్ 51, అక్ష‌ర్‌ప‌టేల్ 42 ప‌రుగుతో ఉన్నారు.

  • 11 Apr 2023 08:49 PM (IST)

    అర్ధ‌శ‌త‌కం

    ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఒంటి పోరాటం చేస్తున్నాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 43 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 16 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 136/5. డేవిడ్ వార్న‌ర్ 50, అక్ష‌ర్‌ప‌టేల్ 28 ప‌రుగుతో ఉన్నారు.

  • 11 Apr 2023 08:36 PM (IST)

    పాంచ్ ప‌టాకా

    ఢిల్లీ జ‌ట్టుకు ముంబై బౌల‌ర్లు వ‌రుస షాక్‌లు ఇస్తున్నారు. క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డ‌గొడుతున్నారు. 13ఓవ‌ర్ మూడో బంతికి లలిత్ యాద‌వ్ ను చావ్లా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఢిల్లీ జ‌ట్టు స‌గం వికెట్ల‌ను కోల్పోయింది.13 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 103/5. డేవిడ్ వార్న‌ర్ 46, అక్ష‌ర్‌ప‌టేల్ 1 ప‌రుగుతో ఉన్నారు.

  • 11 Apr 2023 08:27 PM (IST)

    మ‌రో వికెట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. పీయూష్ చావ్లా వేసిన 10.4 ఓవ‌ర్‌కు రోవ్‌మన్ పావెల్ ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 88/4. డేవిడ్ వార్న‌ర్ 33, లలిత్ యాదవ్ 1 ప‌రుగుతో ఉన్నారు.

  • 11 Apr 2023 08:22 PM (IST)

    పుంజుకున్న ముంబై బౌల‌ర్లు.. వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు

    ఢిల్లీ బ్యాట‌ర్ల దూకుడు ముంబై బౌల‌ర్లు కాస్త అడ్డుక‌ట్ట వేశారు. వ‌రుస ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మ‌నీశ్ పాండేను పీయూస్ చావ్లా ఔట్ చేయ‌గా అరంగ్రేట ఆట‌గాడు య‌శ్‌దుల్‌(2)ను రిలే మెరిడిత్ పెవిలియ‌న్‌కు పంపించాడు. దీంతో ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయింది. 10 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 85/3. డేవిడ్ వార్న‌ర్ 31, రోవ్‌మన్ పావెల్ 4 ప‌రుగుతో ఉన్నారు.

  • 11 Apr 2023 08:14 PM (IST)

    మ‌నీశ్ పాండే ఔట్‌

    దూకుడుగా ఆడుతున్న మ‌నీశ్ పాండేను పీయూష్ చావ్లా బోల్తా కొట్టించాడు. 18 బంతుల్లో 5 ఫోర్ల‌తో 26 ప‌రుగులు చేసిన మ‌నీశ్ పాండే.. జేసన్ బెహ్ర‌న్‌డార్ఫ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో మూడు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 78/2. డేవిడ్ వార్న‌ర్ 29, యశ్ ధుల్ 1 ప‌రుగుతో ఉన్నారు.

  • 11 Apr 2023 08:08 PM (IST)

    16 ప‌రుగులు

    హృతిక్ షోకీన్ వేసిన ఈ ఓవ‌ర్‌లో నాలుగో బంతికి మ‌నీశ్ పాండే ఫోర్ కొట్టాడు. ఎక్స్‌ట్రాలుగా ఐదు వైడ్‌లు రాగా మొత్తంగా 16 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 75/1. డేవిడ్ వార్న‌ర్ 27, మ‌నీష్ పాండే 26 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 07:58 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. హృతిక్ షోకీన్ వేసిన ఆరో ఓవ‌ర్‌లోని ఐదు, ఆరు బంతుల‌ను మనీష్ పాండే ఫోర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 51/1. డేవిడ్ వార్న‌ర్ 18, మ‌నీష్ పాండే 17 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 07:53 PM (IST)

    మ‌నీష్ పాండే రెండు ఫోర్లు

    పృథ్వీ ఔటైన త‌రువాత వ‌చ్చిన మ‌నీష్ పాండే దూకుడుగా ఆడే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రిలే మెరిడిత్ వేసిన ఐదో ఓవ‌ర్‌లోని నాలుగు, ఐదు బంతుల‌ను బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 42/1. డేవిడ్ వార్న‌ర్ 17, మ‌నీష్ పాండే 9 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 07:48 PM (IST)

    పృథ్వీ షా ఔట్‌

    ఈ సీజ‌న్‌లో పేల‌వ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు పృథ్వీ షా(15). మూడు ఫోర్లు బాది మంచి ట‌చ్‌లో ఉన్న‌ట్లు క‌నిపించిన షా.. హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ ఓవ‌ర్లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 34/1. డేవిడ్ వార్న‌ర్ 17, మ‌నీష్ పాండే 1 ప‌రుగుఉన్నారు.

  • 11 Apr 2023 07:45 PM (IST)

    రెండు ఫోర్లు బాదిన వార్న‌ర్‌

    డేవిడ్ వార్న‌ర్ త‌న ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన మూడో ఓవ‌ర్‌లోని ఆఖ‌రి రెండు బంతుల‌ను వార్న‌ర్ ఫోర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 29/0. డేవిడ్ వార్న‌ర్ 17, పృథ్వీ షా 11 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 07:40 PM (IST)

    12 ప‌రుగులు

    రెండో ఓవ‌ర్‌ను అర్షద్ ఖాన్ వేశాడు. తొలి బంతిని వార్న‌ర్ బౌండరీకి త‌ర‌లించ‌గా ఆఖ‌రి బంతికి పృథ్వీ షా ఫోర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. ఢిల్లీ స్కోరు 19/0

  • 11 Apr 2023 07:34 PM (IST)

    బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ

    టాస్ ఓడడంతో ఢిల్లీ ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌, పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. తొలి ఓవ‌ర్‌ను జేసన్ బెహ్ర‌న్‌డార్ఫ్ వేయ‌గా పృథ్వీ షా మూడో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 7 ప‌రుగులు వ‌చ్చాయి. డేవిడ్ వార్న‌ర్ 2, పృథ్వీ షా 5 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 11 Apr 2023 07:11 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు

    పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మనీష్ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీప‌ర్‌), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్జ్‌, ముస్తాఫిజుర్ రెహమాన్

  • 11 Apr 2023 07:09 PM (IST)

    ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు

    రోహిత్ శర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహ‌ల్ వధేరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జేసన్ బెహ్ర‌న్‌డార్ఫ్‌, రిలే మెరిడిత్

  • 11 Apr 2023 07:08 PM (IST)

    టాస్ గెలిచిన ముంబై

    ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. గ‌త రెండు మ్యాచుల్లో అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగా రాణించ‌లేదు. మంచు కురిసే అవ‌కాశం ఉండ‌డంతో చేజింగ్ ఈజీగా ఉంటుంద‌ని బావిస్తున్నాను. స్టబ్స్ స్థానంలో రిలే మెరెడిత్ తీసుకున్నాము. సీనియ‌ర్ ఆట‌గాళ్లు బాధ్య‌త‌గా ఆడాల్సి ఉంది. జోఫ్రా ఆర్చ‌ర్ ఈ మ్యాచ్‌లో ఆడ‌డం లేదు అని రోహిత్ శ‌ర్మ అన్నాడు.