IPL 2023, MI vs KKR: కోల్‌క‌తా పై ముంబై ఘ‌న విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నిర్దేశించిన 186 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 17.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది

IPL 2023, MI vs KKR: కోల్‌క‌తా పై ముంబై ఘ‌న విజ‌యం

MI vs KKR

IPL 2023, MI vs KKR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నిర్దేశించిన 186 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 17.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 16 Apr 2023 07:27 PM (IST)

    ముంబై గెలుపు

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నిర్దేశించిన 186 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 17.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్‌(58; 25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు

  • 16 Apr 2023 07:14 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై

    ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న సూర్య‌కుమార్ యాద‌వ్(43) శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 176 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 180/4. నెహాల్ వధేరా(1), టిమ్ డేవిడ్‌(23) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 06:57 PM (IST)

    తిల‌క్ వ‌ర్మ ఔట్‌

    ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు మూడో వికెట్ కోల్పోయింది. సుయాష్ శర్మ బంతిని త‌ప్పుగా అంచ‌నా వేసిన తిల‌క్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. 14 ఓవ‌ర్ల‌కు ముంబై 148/3. టిమ్ డేవిడ్‌(1), సూర్య‌కుమార్ యాద‌వ్‌(37) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 06:50 PM (IST)

    ఫామ్ అందుకున్న సూర్య‌కుమార్‌, దూకుడుగా ఆడుతున్న తిల‌క్‌

    గ‌త కొద్ది రోజులుగా ఫామ్‌లేమితో ఇబ్బందులు ప‌డుతున్న సూర్య‌కుమార్ యాద‌వ్ ఎట్ట‌కేల‌కు ఫామ్ అందుకున్నాడు. త‌న‌దైన శైలిలో ప‌రుగులు రాబ‌డుతున్నాడు. ఆండ్రీ ర‌స్సెల్ వేసిన 13వ ఓవ‌ర్‌లో ఓ సిక్స్‌, ఫోర్ కొట్టాడు. ఇదే ఓవ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ కూడా ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 17 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు 147/2. తిల‌క్ వ‌ర్మ‌(30), సూర్య‌కుమార్ యాద‌వ్‌(37) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 06:35 PM (IST)

    నిల‌క‌డ‌గా ఆడుతున్న సూర్య‌కుమార్‌, తిల‌క్ వ‌ర్మ‌

    ఇషాన్ కిష‌న్ ఔటైన త‌రువాత ప‌రుగుల వేగం కాస్త త‌గ్గింది. సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌లు కాస్త నిదానంగా ఆడుతున్నారు. సునీల్ నరైన్ వేసిన ప‌దో ఓవ‌ర్‌లో తిల‌క్ వ‌ర్మ ఓ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 110/2. తిల‌క్ వ‌ర్మ‌(16), సూర్య‌కుమార్ యాద‌వ్‌(14) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 06:24 PM (IST)

    ఇషాన్ కిష‌న్ అర్ధ‌శ‌త‌కం..ఆ వెంట‌నే ఔట్‌

    సుయాష్ శర్మ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన ఇషాన్ కిష‌న్ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంట‌నే వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 87 ప‌రుగుల వ‌ద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 8 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 90/2. తిల‌క్ వ‌ర్మ‌(3), సూర్య‌కుమార్ యాద‌వ్‌(7) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 06:12 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    ముంబై ఇండియ‌న్స్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌రి వేసిన ఆరో ఓవ‌ర్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ ఓ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు ముంబై స్కోరు 72/1. సూర్య‌కుమార్ యాద‌వ్‌(5), ఇషాన్ కిష‌న్‌(45)లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 06:08 PM (IST)

    రోహిత్ ఔట్‌

    ముంబై జ‌ట్టుకు సుయాష్ శర్మ షాకిచ్చాడు. దూకుడుగా ఆడుతున్న రోహిత్ శ‌ర్మ‌ను ఔట్ చేశాడు. తొలి బంతికి సిక్స్ కొట్టిన రోహిత్ అదే ఊపులో ఐదో బంతికి భారీ షాట్‌కు య‌త్నించి ఔట్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్లు ముంబై స్కోరు 65/1. సూర్య‌కుమార్ యాద‌వ్‌(0), ఇషాన్ కిష‌న్‌(43)లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 06:04 PM (IST)

    ధాటిగా ఆడుతున్న బ్యాట‌ర్లు

    పవ‌ర్ ప్లే వీలైన‌న్ని ఎక్కువ ప‌రుగులు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముంబై బ్యాట‌ర్లు బాదుతున్నారు. నాలుగో ఓవ‌ర్‌లోనూ ప‌రుగుల వ‌ర‌ద పారింది. సునీల్ నరైన్ వేసిన ఈ ఓవ‌ర్‌లో రోహిత్ తొలి బంతికి బౌండ‌రీ కొట్ట‌గా, మూడు, ఐదుల‌ను ఇషాన్ సిక్స‌ర్లుగా మలిచాడు. ఆఖ‌రి బంతికి ఇషాన్ ఫోర్ సాధించాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 22 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్లు ముంబై స్కోరు 57/0. రోహిత్ శ‌ర్మ‌(13), ఇషాన్ కిష‌న్‌(42)

  • 16 Apr 2023 05:58 PM (IST)

    17 ప‌రుగులు

    ఉమేశ్ యాద‌వ్ వేసిన మూడో ఓవ‌ర్‌లో రోహిత్ ఓ సిక్స్ కొట్ట‌గా, ఇషాన్ కిష‌న్ ఓ సిక్స్‌, ఓ ఫోర్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 17 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్లు ముంబై స్కోరు 35/0. రోహిత్ శ‌ర్మ‌(9), ఇషాన్ కిష‌న్‌(26) లు క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 05:54 PM (IST)

    ధాటిగా ఆడుతున్న ఇషాన్ కిష‌న్‌

    ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ వేగం పెంచింది. తొలి ఓవ‌ర్‌లో రెండు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. శార్దూల్ వేసిన రెండో ఓవ‌ర్‌లో ఇషాన్ కిష‌న్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ను కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం 16 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్లు ముంబై స్కోరు 18/0. రోహిత్ శ‌ర్మ‌(2), ఇషాన్ కిష‌న్‌(16)లు క్రీజులో ఉన్నారు. తుది జ‌ట్టులో లేని రోహిత్ శ‌ర్మ ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగాడు.

  • 16 Apr 2023 05:28 PM (IST)

    ముంబై టార్గెట్ 186

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 185 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(104; 51బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స‌ర్లు) సెంచ‌రీతో చెల‌రేగాడు. రహ్మానుల్లా గుర్బాజ్(8), ఎన్ జ‌గ‌దీశ‌న్‌(0), నితీశ్ రాణా(5) రింకూ సింగ్‌(18)లు విఫ‌లం అయ్యారు. ఆఖ‌ర్లో ఆండ్రూ ర‌స్సెల్(21; 11బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్‌) వేగంగా ప‌రుగులు చేయ‌డంతో ముంబై ముందు 186 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

  • 16 Apr 2023 05:12 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్‌

    సెంచ‌రీ చేసిన వెంట‌నే అయ్య‌ర్ ఔటైయ్యాడు. రిలే మెరెడిత్ వేసిన 18వ ఓవ‌ర్‌లోని రెండో బంతికి జాన్సెన్ క్యాచ్ అందుకోవ‌డంతో అయ్య‌ర్(104) ఇన్నింగ్స్ ముగిసింది. ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్లు కోల్‌క‌తా స్కోరు 160/5. ఆండ్రీ ర‌స్సెల్‌(1), రింకూ సింగ్‌(18) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 05:07 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ శ‌త‌కం

    ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో మ‌రో శ‌త‌కం న‌మోదు అయ్యింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఆట‌గాడు వెంక‌టేశ్ అయ్య‌ర్ సెంచ‌రీ చేశాడు. వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో జాన్సెన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌ల‌తో ఐపీఎల్‌లో త‌న తొలి సెంచ‌రీని న‌మోదు చేశాడు. అంతేకాకుండా ఈ సీజ‌న్‌లో రెండో సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. రెండు రోజుల క్రితం స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడు హ్యారీ బ్రూక్ కోల్‌క‌తాపై సెంచ‌రీ చేశాడు.

  • 16 Apr 2023 04:47 PM (IST)

    దంచికొడుతున్న వెంక‌టేశ్ అయ్య‌ర్‌

    వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి వెంక‌టేశ్ అయ్య‌ర్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఎడాపెడా ఫోర్లు, సిక్స‌ర్లు బాదుతున్నాడు. మెరిడిత్ వేసిన 11 ఓవ‌ర్‌లోని మూడు, నాలుగు బంతుల‌కు సిక్స‌ర్లు బాదాడు. ఆ త‌రువాత జాన్సెన్ వేసిన 12 ఓవ‌ర్‌లోని రెండో బంతికి కూడా సిక్స్ కొట్టాడు. 12 ఓవ‌ర్లు కోల్‌క‌తా స్కోరు 117/3. శార్దూల్ ఠాకూర్ (10), వెంక‌టేశ్ అయ్య‌ర్ (83) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 04:27 PM (IST)

    వెంక‌టేశ్ అయ్యర్ అర్ధ‌శ‌త‌కం

    ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి వెంక‌టేశ్ అయ్య‌ర్ దూకుడుగానే ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలో హృతిక్ షోకీన్ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లోని నాలుగో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించి 23 బంతుల్లోనే అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. చివ‌రి బంతిని సిక్స్‌గా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 84/3. శార్దూల్ ఠాకూర్ (1), వెంక‌టేశ్ అయ్య‌ర్ (59) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 04:23 PM (IST)

    నితీశ్ రాణా ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. హృతిక్ షోకీన్ వేసిన 8.1ఓవ‌ర్‌కు నితీశ్ రాణా (5) ర‌మ‌న్‌దీప్‌ సింగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్ 49 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు.

  • 16 Apr 2023 04:10 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన కోల్‌క‌తా

    కోల్‌క‌తా జ‌ట్టు రెండో వికెట్ కోల్పోయింది. షాట్లు ఆడేందుకు ఇబ్బంది ప‌డుతున్న రహ్మానుల్లా గుర్బాజ్‌(8) పీయూష్ చావ్లా బౌలింగ్‌లో డువాన్ జాన్సెన్ క్యాచ్ ప‌ట్ట‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 57 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా రెండో వికెట్ కోల్పోయింది. ఈ ఓవ‌ర్‌లో 2 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు స్కోరు 61/2, నితీష్ రాణా(0) వెంక‌టేశ్ అయ్య‌ర్‌(39) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 04:06 PM (IST)

    16 ప‌రుగులు

    వెంక‌టేశ్ అయ్య‌ర్ త‌న జోరును కొన‌సాగిస్తున్నాడు. డువాన్ జాన్సెన్ వేసిన ఐదో ఓవ‌ర్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు వ‌చ్చాయి. 5 ఓవ‌ర్ల‌కు స్కోరు 55/1, రహ్మానుల్లా గుర్బాజ్ (7), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(38) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 04:01 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న వెంక‌టేశ్ అయ్యర్‌

    వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన వెంక‌టేశ్ అయ్య‌ర్ దూకుడుగా ఆడుతున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన మూడో ఓవ‌ర్‌లోని రెండో బంతిని సిక్స్‌గా మ‌ల‌చగా నాలుగో బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు స్కోరు 39/1, రహ్మానుల్లా గుర్బాజ్ (6), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(24) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 03:46 PM (IST)

    జ‌గ‌దీశ‌న్ ఔట్‌

    కోల్‌క‌తా జ‌ట్టుకు కామెరూన్ గ్రీన్ షాకిచ్చాడు. గ్రీన్ వేసిన రెండో ఓవ‌ర్‌లోని ఐదో బంతికి షాట్ ఆడిన జ‌గ‌దీశ‌న్ (0) షోకిన్ చేతికి చిక్కాడు. దీంతో కోల్‌క‌తా 11 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవ‌ర్ల‌కు స్కోరు 12/1, రహ్మానుల్లా గుర్బాజ్ (5), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 03:38 PM (IST)

    తొలి ఓవ‌ర్‌లో 5 ప‌రుగులే ఇచ్చిన అర్జున్ టెండూల్క‌ర్‌

    టాస్ ఓడిన కోల్‌క‌తా బ్యాటింగ్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్, ఎన్‌.జ‌గ‌దీశ‌న్ ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ తొలి ఓవ‌ర్ ను వేశాడు. బ్యాట‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. కేవ‌లం ఐదు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. కోల్‌క‌తా స్కోరు 5/0. రహ్మానుల్లా గుర్బాజ్ (4), ఎన్‌.జ‌గ‌దీశ‌న్ (0) క్రీజులో ఉన్నారు.

  • 16 Apr 2023 03:11 PM (IST)

    ముంబై ఇండియన్స్ తుది జ‌ట్టు

    ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్

  • 16 Apr 2023 03:10 PM (IST)

    కోల్‌కతా తుది జ‌ట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), వెంకటేష్ అయ్యర్, ఎన్ జగదీషన్, నితీష్ రాణా(కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి