IPL 2023, PBKS vs MI: ఇషాన్ కిషన్, సూర్యకుమార్ మెరుపులు.. పంజాబ్‌పై ముంబై విజయం
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది.

PBKS vs MI
IPL 2023, PBKS vs MI: ఐపీఎల్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది. దీంతో పంజాబ్ పై ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
LIVE NEWS & UPDATES
-
ముంబై విజయం
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి ఛేదించింది. దీంతో పంజాబ్ పై ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
-
టిమ్ డేవిడ్ ఫోర్
18 ఓవర్‌ను సామ్ కరన్ వేశాడు. తొలి బంతికి టిమ్ డేవిడ్ ఫోర్ కొట్టడంతో 9 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లకు ముంబై స్కోరు 203/4. తిలక్ వర్మ(18), టిమ్ డేవిడ్(14) క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఔట్
ముంబై మరో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిషి ధావన్ క్యాచ్ అందుకోవడంతో ఇషాన్‌కిషన్(75) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ముంబై 178 పరుగుల(16.1వ ఓవర్) వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ వచ్చి రావడంతో రెండు సిక్స్‌లు ఓ ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లకు ముంబై స్కోరు 184/4. తిలక్ వర్మ(16), టిమ్ డేవిడ్(7) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ ఔట్
ముంబై మరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్(66) అర్ష్‌దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 170 పరుగుల(17.1వ ఓవర్) వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు ముంబై స్కోరు 178/3. ఇషాన్ కిషన్(75), టిమ్ డేవిడ్(7) క్రీజులో ఉన్నారు.
-
21 పరుగులు
15వ ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. ఈ ఓవర్‌లో ముంబై బ్యాటర్లు విరుచుకుపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ ఓ ఫోర్ కొట్టగా.. ఆఖరి మూడు బంతులకు వరుసగా 6,4,4 బాదాడు ఇషాన్ కిషన్. 15 ఓవర్లకు ముంబై స్కోరు 170/2. ఇషాన్ కిషన్(74), సూర్యకుమార్ యాదవ్(66) క్రీజులో ఉన్నారు.
-
11 పరుగులు
14వ ఓవర్‌ను నాథన్ ఎల్లిస్ వేశాడు. ఈ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 11 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు ముంబై స్కోరు 149/2. ఇషాన్ కిషన్(61), సూర్యకుమార్ యాదవ్(59) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ
సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్‌ను సామ్ కరన్ వేయగా సూర్యకుమార్ విధ్వంసం సృష్టించాడు. వరుసగా 6, 6, 4, 4 బాదడంతో 23 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు ముంబై స్కోరు 138/2. ఇషాన్ కిషన్(57), సూర్యకుమార్ యాదవ్(52) క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ అర్ధశతకం
నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో(11.1వ ఓవర్) రెండు పరుగులు తీసి ఇషాన్ కిషన్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవర్లకు ముంబై స్కోరు 115/2. ఇషాన్ కిషన్(56), సూర్యకుమార్ యాదవ్(31) క్రీజులో ఉన్నారు.
-
మూడు ఫోర్లు
పదకొండో ఓవర్‌ను రాహుల్ చహర్ వేశాడు. ఈ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ రెండు ఫోర్లు కొట్టగా ఇషాన్ కిషన్ ఓ ఫోర్ బాదడంతో మొత్తంగా 14 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు ముంబై స్కోరు 105/2. ఇషాన్ కిషన్(48), సూర్యకుమార్ యాదవ్(29) క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఫోర్, సిక్స్
హర్‌ప్రీత్ బ్రార్ పదో ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతికి ఫోర్ కొట్టిన ఇషాన్ కిషన్ ఆఖరి బంతికి సిక్స్ బాదాడు. దీంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు ముంబై స్కోరు 91/2. ఇషాన్ కిషన్(43), సూర్యకుమార్ యాదవ్(20) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ ఫోర్
తొమ్మిదో ఓవర్‌ను రాహుల్ చహర్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతికి సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా 10 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు ముంబై స్కోరు 77/2. ఇషాన్ కిషన్(31), సూర్యకుమార్ యాదవ్(18) క్రీజులో ఉన్నారు.
-
7 పరుగులు
హర్‌ప్రీత్ బ్రార్ ఎనిమిదో ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు ముంబై స్కోరు 67/2. ఇషాన్ కిషన్(28), సూర్యకుమార్ యాదవ్(11) క్రీజులో ఉన్నారు.
-
సూర్యకుమార్ యాదవ్ ఫోర్
ఏడో ఓవర్‌ను రాహుల్ చహర్ వేశాడు. మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు ముంబై స్కోరు 60/2. ఇషాన్ కిషన్(27), సూర్యకుమార్ యాదవ్(5) క్రీజులో ఉన్నారు.
-
గ్రీన్ ఔట్
ముంబై మరో వికెట్ కోల్పోయింది. ఆరో ఓవర్‌ను నాథన్ ఎల్లిస్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి కామెరూన్ గ్రీన్(23) రాహుల్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 54 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్లకు ముంబై స్కోరు 54/2. ఇషాన్ కిషన్(26) క్రీజులో ఉన్నాడు
-
రెండు సిక్స్‌లు, ఓ ఫోర్
రిషి ధావన్ ఐదో ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లో ఇషాన్ కిషన్ రెండు సిక్సర్లు కొట్టగా, గ్రీన్ ఓ ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు ముంబై స్కోరు 49/1. ఇషాన్ కిషన్(24), కామెరూన్ గ్రీన్(20) క్రీజులో ఉన్నారు.
-
కామెరూన్ గ్రీన్ రెండు ఫోర్లు
నాలుగో ఓవర్‌ను సామ్ కరన్ వేశాడు. ఈ ఓవర్‌లో గ్రీన్ రెండు ఫోర్లు కొట్టడంతో 9 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు ముంబై స్కోరు 32/1. ఇషాన్ కిషన్(11), కామెరూన్ గ్రీన్(16) క్రీజులో ఉన్నారు.
-
2 పరుగులు
మూడో ఓవర్‌ను రిషి ధావన్ కట్టుదిట్టంగా వేయడంతో రెండు పరుగులే వచ్చాయి. 3 ఓవర్లకు ముంబై స్కోరు 23/1. ఇషాన్ కిషన్(10), కామెరూన్ గ్రీన్(8) క్రీజులో ఉన్నారు.
-
మూడు ఫోర్లు
అర్ష్‌దీప్ సింగ్ రెండో ఓవర్‌ను వేశాడు. తొలి బంతికి కామెరూన్ గ్రీన్, ఆఖరి రెండు బంతులకు ఇషాన్ కిషన్ ఫోర్లు కొట్టారు. మొత్తంగా ఈ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లకు ముంబై స్కోరు 21/1. ఇషాన్ కిషన్(9), కామెరూన్ గ్రీన్(7) క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ శర్మ డకౌట్
భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై జట్టుకు భారీ షాక్ తగిలింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(0) రిషి ధావన్ బౌలింగ్‌లో మూడో బంతికి మాథ్యూ షార్ట్ క్యాచ్ అందుకోవడంతో డకౌట్ అయ్యాడు. 1 ఓవర్ కు ముంబై స్కోరు 5/1. ఇషాన్ కిషన్(0), కామెరూన్ గ్రీన్(1) క్రీజులో ఉన్నారు.
-
ముంబై లక్ష్యం 215
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. లివింగ్‌స్టోన్ (82 నాటౌట్; 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) జితేశ్ శర్మ(49 నాటౌట్; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా, అర్షద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
-
హ్యాట్రిక్ సిక్సర్లు
19వ ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. తొలి మూడు బంతులను లివింగ్ స్టోన్ సిక్సర్లుగా మలిచాడు. ఆరో బంతి వైడ్ ఫోర్‌గా వెల్లడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లకు పంజాబ్ స్కోరు 205/3. జితేశ్ శర్మ(47), లివింగ్ స్టోన్(75) క్రీజులో ఉన్నారు.
-
లివింగ్ స్టోన్ అర్ధశతకం
ఆకాశ్ మధ్వల్ వేసిన 18వ ఓవర్‌లోని రెండో బంతికి ఫోర్ కొట్టి 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ లివింగ్ స్టోన్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 18 ఓవర్లకు పంజాబ్ స్కోరు 178/3. జితేశ్ శర్మ(45), లివింగ్ స్టోన్(54) క్రీజులో ఉన్నారు.
-
ఫోర్, సిక్స్
17వ ఓవర్‌ను అర్షద్ ఖాన్ వేయగా 14 పరుగులు వచ్చాయి. రెండో బంతికి సిక్స్ కొట్టిన జితేశ్ మూడో బంతికి ఫోర్ బాదాడు. 17 ఓవర్లకు పంజాబ్ స్కోరు 166/3. జితేశ్ శర్మ(39), లివింగ్ స్టోన్(49) క్రీజులో ఉన్నారు.
-
7 పరుగులు
16వ ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. రెండో బంతికి లివింగ్ స్టోన్ ఫోర్ కొట్టడంతో 7 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 152/3. జితేశ్ శర్మ(26), లివింగ్ స్టోన్(49) క్రీజులో ఉన్నారు.
-
లివింగ్ స్టోన్ మూడు ఫోర్లు
15వ ఓవర్‌ను అర్షద్ ఖాన్ వేయగా లివింగ్ స్టోన్ మూడు ఫోర్లు బాదడంతో మొత్తంగా 14 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు పంజాబ్ స్కోరు 145/3. జితేశ్ శర్మ(24), లివింగ్ స్టోన్(44) క్రీజులో ఉన్నారు.
-
జితేశ్ సిక్స్
14వ ఓవర్‌ను కుమార్ కార్తికేయ వేశాడు. ఈ ఓవర్‌లో నాలుగో బంతికి జితేశ్ సిక్స్ కొట్టగా మొత్తంగా 11 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు పంజాబ్ స్కోరు 131/3. జితేశ్ శర్మ(23), లివింగ్ స్టోన్(31) క్రీజులో ఉన్నారు.
-
ఒకే ఓవర్‌లో 21 పరుగులు
వచ్చి రావడంతోనే జితేశ్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. జోఫ్రా ఆర్చర్ 13వ ఓవర్‌ను వేయగా మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో మొత్తంగా 21 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు పంజాబ్ స్కోరు 120/3. జితేశ్ శర్మ(15), లివింగ్ స్టోన్(28) క్రీజులో ఉన్నారు.
-
మాథ్యూ షార్ట్ ఔట్
పంజాబ్ మరో వికెట్ కోల్పోయింది. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్(27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ 95 పరుగుల(11.2వ ఓవర్) వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు పంజాబ్ స్కోరు 99/3. జితేశ్ శర్మ(2), లివింగ్ స్టోన్(26) క్రీజులో ఉన్నారు.
-
ఫోర్, సిక్స్
పదకొండో ఓవర్‌ను ఆకాశ్ మధ్వల్ వేశాడు. ఈ ఓవర్‌లో లివింగ్ స్టోన్ ఓ ఫోర్, సిక్స్ కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు పంజాబ్ స్కోరు 94/2. మాథ్యూ షార్ట్(27), లివింగ్ స్టోన్(23) క్రీజులో ఉన్నారు.
-
లివింగ్ స్టోన్ ఫోర్
పదో ఓవర్‌ను చావ్లా వేశాడు. ఐదో బంతికి లివింగ్ స్టోన్ ఫోర్ కొట్టడంతో 7 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 78/2. మాథ్యూ షార్ట్(24), లివింగ్ స్టోన్(11) క్రీజులో ఉన్నారు.
-
ఆరు పరుగులు
కుమార్ కార్తికేయ తొమ్మిదో ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో ఆరు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు పంజాబ్ స్కోరు 71/2. మాథ్యూ షార్ట్(23), లివింగ్ స్టోన్(5) క్రీజులో ఉన్నారు.
-
ధావన్ ఔట్
దూకుడుగా ఆడుతున్న ధావన్(30) ఔట్ అయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ 62 పరుగుల(7.2వ ఓవర్) వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 8 ఓవర్లకు పంజాబ్ స్కోరు 65/2. మాథ్యూ షార్ట్(21), లివింగ్ స్టోన్(2) క్రీజులో ఉన్నారు.
-
క్యాచ్ మిస్.. బతికిపోయిన ధావన్
ఏడో ఓవర్‌ను కుమార్ కార్తికేయ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతికి ధావన్ బ్యాడ్‌వుడ్ పాయింట్ దిశగా షాట్ ఆడగా కష్టమైనదే అయినప్పటికీ ఆర్చర్ క్యాచ్ అందుకోవడంతో విఫలం అయ్యాడు. దీంతో ధావన్ బతికి పోయాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు పంజాబ్ స్కోరు 58/1. శిఖర్ ధావన్(26), మాథ్యూ షార్ట్(20) క్రీజులో ఉన్నారు.
-
ధావన్ రెండు ఫోర్లు
పంజాబ్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసింది. ఆరో ఓవర్‌ను పీయూష్ చావ్లా వేశాడు. ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు పంజాబ్ స్కోరు 50/1. శిఖర్ ధావన్(23), మాథ్యూ షార్ట్(18) క్రీజులో ఉన్నారు.
-
5 పరుగులు
జోఫ్రా ఆర్చర్ ఐదో ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 40/1. శిఖర్ ధావన్(14), మాథ్యూ షార్ట్(17) క్రీజులో ఉన్నారు.
-
ఫోర్, సిక్స్
వచ్చి రావడంతోనే మాథ్యూ షార్ట్ దూకుడుగా ఆడుతున్నాడు. అర్షద్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్‌లోని ఆఖరి రెండు బంతులను వరుసగా సిక్స్, ఫోర్ గా మలిచాడు. ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు పంజాబ్ స్కోరు 35/1. శిఖర్ ధావన్(11), మాథ్యూ షార్ట్(15) క్రీజులో ఉన్నారు.
-
శిఖర్ ధావన్ ఫోర్
కామెరూన్ గ్రీన్ మూడో ఓవర్‌ను వేశాడు. ఐదో బంతికి శిఖర్ ధావన్ ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు పంజాబ్ స్కోరు 23/1. శిఖర్ ధావన్(10), మాథ్యూ షార్ట్(4) క్రీజులో ఉన్నారు.
-
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టుకు షాక్ తగిలింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకోవడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్(9) ఔట్ అయ్యాడు. దీంతో 13 పరుగుల(1.3వ ఓవర్) వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు పంజాబ్ స్కోరు 17/1. శిఖర్ ధావన్(4), మాథ్యూ షార్ట్(4) క్రీజులో ఉన్నారు.
-
ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్
-
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
-
టాస్ గెలిచిన ముంబై
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ముఖాముఖిగా తలపడుతుండడం ఇది రెండో సారి. మొదటి మ్యాచులో పంజాబ్ కింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరీ ఇందుకు నేటి మ్యాచులో ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి